అల్లు అర్హ ‘అంజలి’ వీడియో సాంగ్‌.. ట్రెండింగ్‌లో

21 Nov, 2020 12:26 IST|Sakshi

అల్లు అర్హ.. టాలీవుడ్‌ ఇండస్ట్రీలో పరిచయం అక్కరలేని పేరు. స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ముద్దుల కూతురు అయిన అర్హ.. చిన్నతనంలోనే తన క్యూట్‌నెస్‌తో ఇప్పటికే అభిమానుల్లో బోలెడంత క్రేజ్‌ సంపాదించింది. ఆమె ఏం చేసిన సోషల్‌ మీడియాలో ఓ ట్రెండ్‌ క్రియెట్‌ చేస్తుంది. నేడు(నవంబర్‌ 21) అర్హ తన నాలుగో పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌లో ఓ వీడియో సాంగ్‌ రిలీజ్‌ చేశాడు. 1990లో విడుదలైన క్లాసిక్‌ మూవీ అంజలి సినిమాలోని ‘అంజలి అంజలి అంజలి’ అనే పాట ఎంత హిట్‌ అయ్యిందో అందరికి తెలిసిందే. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. ఈ పాటలో బేబీ షామిలీ తన నటనతో అందరిని మంత్రముగ్దులను చేసింది. తాజాగా ఈ సినిమాలోని టైటిల్ సాంగ్‌ను అల్లు అర్హతో మళ్లీ రీ క్రియేట్‌ చేసి వీడియో సాంగ్‌ను విడుదల చేశాడు. చదవండి: కూతురు బర్త్‌డేకు సర్‌ఫ్రైజ్‌‌ ఇచ్చిన అల్లు అర్జున్‌

ఈ పాటలో ఆర్హ  క్యూట్‌ క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. అచ్చం పాత సినిమా పాట మాదిరిగానే చిన్న పిల్లలందరిని కూడగట్టి సరికొత్తగా షూట్‌ చేశారు. ఇందులో అర్హతోపాటు తన సోదరుడు అయాన్‌ కూడా నటించారు. చివర్లో అల్లు అర్జున్‌ ఎంట్రీ ఇవ్వడం పాట మొత్తానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పాటలో తాతయ్యలు అల్లు అరవింద్‌, కేసీ శేఖర్‌ రెడ్డి కూడా కనిపించారు. ఇక గణేశ్‌ స్వామి కొరియోగ్రఫీ చేసిన లేటెస్ట్‌ అంజలి వీడియో సాంగ్‌కు సూర్య సినిమాటోగ్రాఫర్‌గా వర్క్‌ చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. చదవండి:  చిన్నారి స్వాతంత్య్ర యోధులు

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు