మహా ‘మహమ్మారి’ చిత్రాలివే!

16 Dec, 2020 13:35 IST|Sakshi

న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను కుదిపేయడంతో అనేక దేశాల్లో మధ్య తరగతి వారు ఉద్యోగాలు కోల్పోగా, పేదవారు ఉన్న ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. పర్యావసానంగా భారత్‌లో ఎంతో మంది పేదలకు ఒంటి పూట భోజనమే దిక్కు కాగా అమెరికా వేలాది మంది ప్రజలు ‘ఫుడ్‌ బ్యాంకు’ల వద్ద క్యూలు కడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్నార్థుల ఆకలి బాధలు పెరిగాయి. కరోనా లాంటి ప్రాణాంతక మహమ్మారి మానవాళి మీద దాడిచేస్తే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో చెప్పే పలు హాలివుడ్‌ సినిమాలు మనకు అందుబాటులోకి మళ్లీ వచ్చాయి. (చదవండి : ఐదొంతుల జనాభాకు టీకా దూరం..!)


కంటేజియన్, వరల్డ్‌ వార్‌ జెడ్, పాండెమిక్, 28 డేస్‌ ల్యాటర్, వైరస్‌ ఆ కోవకు చెందిన సినిమాలు. నేరుగా ఆ కోవకు చెందకపోయిన ఆకలి బాధ ఎంత దారుణంగా ఉంటుందో, మనుషులను ఎలా రాక్షసులుగా మారుస్తుందో తెలియజేసే ‘ది కింగ్‌డమ్‌ ఆఫ్‌ ది గాడ్స్‌’ అనే 12 భాగాల వెబ్‌ సిరీస్‌ను గత నవంబర్, మార్చి నెలల్లో రెండు సీరియళ్లుగా ప్రసారం చేసిన ‘నెట్‌ఫ్లిక్స్‌’ జనాదరణ దష్ట్యా మళ్లీ వీక్షకులకు అందుబాటులోకి తెచ్చింది. 

Poll
Loading...
మరిన్ని వార్తలు