ఇండియాలో టాప్‌ వన్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న వెబ్‌ సిరీస్‌..

25 Feb, 2024 09:21 IST|Sakshi

బాలీవుడ్‌  టాప్‌ హీరోయిన్‌ అలియా భట్‌ నిర్మాతగా మారి విజయాన్ని అందుకున్నారు.ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోతో కలిసి ఆమె 'పోచర్‌' అనే వెబ్‌సిరీస్‌ను నిర్మించారు. ఎమ్మీ అవార్డు విన్నర్‌, దర్శకుడు రిచీ మెహతా రూపొందించిన క్రైమ్‌ సిరీస్‌ ఫిబ్రవరి 23 నుంచి అమెజాన్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి వచ్చిన ఈ వెబ్‌ సిరీస్‌కు మంచి ఆదరణ దక్కుతుంది.

(ఇదీ చదవండి:  వరుణ్‌ తేజ్‌- లావణ్య పూజలు.. కారణం ఇదేనా..?)

తాజాగా పోచర్‌ సిరీస్‌ గురించి అలియాభట్‌ ఇలా తెలిపింది. ఈ వెబ్‌ సిరీస్‌ గురించి మంచి రెస్పాన్స్‌ రావడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె చెప్పింది. తన ఇంట్లోని టీవీ ముందు నిలబడి పెంపుడు పిల్లితో  ఉన్న ఫోటోను షేర్‌ చేసింది. వెబ్ సిరీస్ విడుదలైన రోజునే భారతదేశంలో నంబర్ వన్‌గా నిలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొంది. ప్రస్తుతం కూడా పోచర్‌ వెబ్‌ సిరీస్‌ టాప్‌లో ఉంది. సిరీస్ చూడని వారు త్వరగా చూడాలని ఆమె కోరింది. ఇందులో నిమిషా సజయన్, రోషన్ మాథ్యూ, దివ్యేంద్రు భట్టాచార్య ప్రధాన పాత్రలలో కనిపించారు.

కథ ఏంటి..?

ఈ కథ 2015 నేపథ్యంలో నడుస్తూ ఉంటుంది. నిమిషా సజయన్ (మాల) తండ్రి చేసిన పాపానికి పరిహారంగా అడవిలోని వన్య మృగాలను రక్షించాలని ఆమె నిర్ణయించుకుంటుంది. ఏనుగు దంతాల కోసం 18 ఏనుగులను చంపేశారనే వార్త బయటకి రావడంతో 'మాల' నివ్వెరపోతుంది. ఏనుగులను ఎవరు చంపుతున్నారు..? ఏనుగు దంతాల రవాణా ఎక్కడి నుంచి సాగుతోంది..? అవి ఎక్కడికి చేరుకుంటున్నాయి..? మొత్తం ఈ నెట్ వర్క్‌ వెనుక ఉండి నడిపిస్తున్నదెవరు..? అనేది తెలుసుకోవడం కోసం ఒక టీమ్ బరిలోకి దిగుతుంది.

అందులో మాల కూడా భాగం అవుతుంది. ఈ కేసులో ముందుకు వెళుతున్న కొద్దీ వాళ్లకి తెలిసే నిజాలు ఏంటి..? అనేది తెలుసుకోవాలంటే సిరీస్‌ చూడాల్సిందే.. కథను నిదానంగా చెప్పడం వల్ల నిడివి పెరిగిపోయింది. స్క్రీన్ ప్లేలో కొన్ని లోపాలు .. ఇన్వెస్టిగేషన్‌లో వేగం తగ్గడం.. కథలో పెద్దగా లేని ట్విస్టులు .. ప్రధాన మైనస్‌గా ఉన్నాయి.

A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt)

whatsapp channel

మరిన్ని వార్తలు