ఎంగేజ్‌మెంట్ చేసుకున్న నటి.. సోషల్ మీడియాలో వైరల్

13 Jan, 2023 15:50 IST|Sakshi

ప్రముఖ బాలీవుడ్ నటి నిశ్చితార్థం చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. బాలీవుడ్‌ నటి మాన్వి గాగ్రూ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ ప్రముఖులు షిబానీ దండేకర్, మౌని రాయ్, కుబ్రా సైత్, అహానా కుమార్‌తో పాటు ఆమె అభిమానులు అభినందనలు తెలిపారు.  సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ అంటూ పోస్టులు పెడుతున్నారు.  

మాన్వి తన ఇన్‌స్టాలో రాస్తూ.. ' ఫైనల్‌గా ఇది జరిగింది అంటూ రింగ్ ఎమోజీని పోస్టు చేసింది.   తన చేతికి ఉన్న ఎంగేజ్‌మెంట్ ఉంగరాన్ని ప్రదర్శిస్తున్న ఫోటోను పంచుకుంది. అయితే ఆమెకు కాబోయే భర్త గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. 

ధూమ్ మచావో ధూమ్ (2007), బబ్లీ పంజాబీ అమ్మాయి, అంబికా ‘బిక్కి’ గిల్‌ సినిమాలకు ఫేమ్ సంపాదించింది. నో వన్ కిల్డ్ జెస్సికా, పీకే, శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్ వంటి ప్రముఖ ప్రాజెక్ట్‌ల్లో నటించింది. మాన్వీ గాగ్రూ హిందీ సినిమాలతో పాటు టెలివిజన్‌లో కనిపించింది.  టీవీఎఫ్ పిచర్స్, టీవీఎఫ్ ట్రిప్లింగ్, ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ వంటి వెబ్ సిరీస్‌లలో నటించింది. 

A post shared by Maanvi Gagroo (@maanvigagroo)

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు