ప్రముఖుల సవాల్‌: నేను సైతం అంటున్న త్రిష

3 Oct, 2020 14:06 IST|Sakshi

ప్రస్తుతం దేశంలో గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌​ ట్రెండ్‌ నడుస్తోంది. వాతావరణ కాలుష్యాన్ని అరికట్టి ప్రాణ వాయువును కాపాడేందుకు  ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ప్రజా ప్రతినిధులతో పాటు ప్రముఖులు సైతం పిలుపునిస్తున్నారు. కేవలం అంతటితోనే ఆగకుండా.. స్వయంగా మొక్కలు నాటుతూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారు. పర్యవరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కదలిరావాలంటూ తమ మిత్రులకు, ఇతర రంగాల ప్రముఖులకు సవాలు విసురుతున్నారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ప్రముఖులను సైతం పర్యవరణ బాట పట్టిస్తోంది. మరీ ముఖ్యంగా తెలంగాణ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులకు గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ సవాలు విసురుతూ.. వారిచేత మొక్కలు నాటిస్తున్నారు.

ఈ క్రమంలోనే టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు, రచయిత తనికెళ్ల భరణీ విసిరిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను బహుభాషా నటుడు ప్రకాశ్‌ రాజ్‌ పూర్తి చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆ సవాలును ప్రకాశ్‌ పలువురు నటులతో పాటు నటీమణులకు విసిరారు. దీనిలో భాగంగానే ఆయన సవాలును స్వీకరించిన దక్షణాది బ్యూటీ త్రిష.. తాను సైతం అంటూ బరిలోకి దిగారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా త్రిష తన ఫాంహౌస్‌లో మొక్కలు నాటారు. అనంతరం ఆ ఫోటోలను తన సోషల్‌ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. (కేసీఆర్‌పై ప్రకాశ్‌రాజ్‌ ప్రశంసలు)


ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యవరణ పరిరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు త్రిష. ఇక ప్రకాశ్‌రాజ్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంట్‌ జాబితాలో కన్నడ నటుడు మోహన్‌లాల్, తమిళ నటుడు సూర్య, కన్నడ నటుడు రక్షిత్ శెట్టి, హీరోయిన్‌ రమ్యకృష్ణ ఉన్నారు. కాగా 2004లో వర్షం మూవీలో హీరోయిన్‌గా నటించి టాలీవుడ్‌లో తన ప్రస్తానాన్ని ఆరంభించిన త్రిష.. అనతికాలంలోనే స్టార్‌​ హీరోలతో నటించే అవకాన్ని దక్కించున్నారు. ప్రస్తుతం తెలుగుతో పాటు ఇతర భాషాల్లోనూ నటిస్తున్నారు.

మరిన్ని వార్తలు