Trisha Cycling Video: హీరోయిన్‌ త్రిష లైఫ్‌ స్టైలే వేరులే! అమెరికా ట్రిప్‌లో ఎంచక్కా..

2 Oct, 2023 11:07 IST|Sakshi

హీరోయిన్‌ త్రిష లైఫ్‌ స్టైలే వేరులే... 40 ఏళ్ల ఈమెకు మరోసారి లక్కు సుడులు తిరుక్కుంటూ వరించిందని చెప్పక తప్పదు. పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రానికి ముందు వరుస ప్లాపుల్లో కూరుకుపోయింది. ఆ సమయంలో చాలా మంది ఆమె పనైపోయింది అనే కామెంట్స్‌ చేశారు. అలాంటిది అనూహ్యంగా పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంతో ఈ నటి కెరీర్‌ ఉవ్వెత్తున పైకి లేచిందని చెప్పాలి. ప్రస్తుతం విజయ్‌ సరసన నటించిన లియో చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని సెన్సార్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

ఈనెల 19వ తేదీన చిత్రం తెరపైకి రానుంది. కాగా త్వరలో అజిత్‌తో కలిసి విడాముయిర్చి చిత్రంలో నటించడానికి రెడీ అవుతోంది. దీని తర్వాత ఈ బ్యూటీని మరిన్ని అవకాశాలు వరించినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా రజనీకాంత్‌ హీరోగా లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహించనున్న ఆయన 171వ చిత్రంలో హీరోయిన్‌ త్రిషనే అని ప్రచారం జరుగుతోంది. కమలహాసన్‌ 234 చిత్రంలోని ఈ బ్యూటీయే నాయకి అని చాలా కాలంగా  ఓ వార్త వైరలవుతోంది.

కాగా త్రిష ప్రధాన పాత్రలో నటించిన ది రోడ్‌ చిత్రం ఈ నెల 6వ తేదీన తెరపైకి రానుంది. కాగా ప్రస్తుతం తన చిత్రాల విషయాన్ని పక్కన పెట్టిన త్రిష ఈ మధ్యే అమెరికా ట్రిప్‌ను ఎంజాయ్‌ చేసింది. అక్కడ న్యూయార్క్‌ నగర వీధుల్లో స్వేచ్ఛగా, జాలీగా సైకిల్‌ తొక్కుతున్న ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఆ వీడియోను ఇప్పటికే 8 లక్షల మంది చూడడం విశేషం.

చదవండి: బోరున ఏడ్చేసిన రతిక తల్లిదండ్రులు.. ఆమెపై వచ్చిన పుకార్లకు క్లారిటీ

మరిన్ని వార్తలు