మరోసారి తెరపైకి త్రిష పెళ్లి.. వరుడు మాత్రం హీరో కాదట!

18 Apr, 2021 14:45 IST|Sakshi

ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 20 ఏళ్లు గడిచినా ఇప్పటికీ స్టార్‌ హీరోయిన్‌గానే కొనసాగుతుంది త్రిష.  కెరీర్‌ తొలినాళ్లు ఎన్నో సూపర్‌ హిట్లు దక్కించుకున్న ఈ బ్యూటీకి ప్రస్తుతం పెద్దగా అవకాశాలు రావట్లేదు. 96 చిత్రం తర్వాత ఈ సీనియర్‌ హీరోయిన్‌ చేసిన  సినిమాలు ఏవి బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. దీంతో ఈ బ్యూటీకి ప్రస్తుతం టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు అయితే రావడం లేదు. కానీ వేరే భాషల్లో మాత్రం ఫుల్‌ బిజీగా గడుపుతుంది. ఇలాంటి సమయంలో త్రిష పెళ్లికి సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుందని ఓ వార్త కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. త్వరలోనే ఈ 38 ఏళ్ల చిన్నది పెళ్లి చేసుకోబోతుందట. 

గతంలో వరుణ్‌మణిమన్‌ అనే నిర్మాత, వ్యాపారవేత్తతో ప్రేమలో పడిన త్రిష.. పెళ్లి వరకూ వెళ్లి ఆగిపోయింది. అదేవిధంగా తెలుగులో ఒక యువ హీరోతో ప్రేమాయణం అనే ప్రచారం జోరుగానే సాగింది. ప్రస్తుతం త్రిష హీరో శింబుతో ప్రేమాయానం సాగిస్తుందని, త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరిగింది. ఇలాంటి సమయంలో పెళ్లి గురించి త్రిష సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమ్మర్‌లోనే త్రిష పెళ్లి చేసుకోబోతుందట. అయితే త్రిషను పెళ్లి చేసుకోబోయేవాడు మాత్రం చిత్రపరిశ్రమకు చెందిన వాడు కాదని సమాచారం.  త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటనను త్రిష చేయబోతుందనే వార్త కోలీవుడ్‌లో తెగ చక్కర్లు కొడుతోంది.

మరిన్ని వార్తలు