త్వరలోనే త్రిష పెళ్లి.. వరుడు ఎవరంటే!

3 May, 2021 17:41 IST|Sakshi

ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన నటి త్రిష. వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలకు దూరమైయింది. ఇటీవల మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన ఆమె తమిళంలో వరుస సినిమాలు చేస్తూ అక్కడే సెటిలైయిపోయింది. లేడీ ఒరియంటెడ్‌ కథలను ఎచ్చుకుంటు వరుస విజయాలు అందుకుంటోంది. ఇటీవల ఆమె నటించిన పరమపదం అనే మూవీ ఓటీటీలో విడుదలై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇదిలా ఉండగా త్రిష మరోసారి ప్రేమలో పడినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో వరుణ్‌ మణియన్‌ అనే వ్యాపారవేత్తతో ప్రేమలో పడిన ఆమె అతడితో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇక పెళ్లి వరకు వెళ్లిన ఈ జంట నిశ్చితార్థం తర్వాత వచ్చిన కొన్ని మనస్పర్థల కారణంగా పెళ్లిని రద్దు చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి సినిమాలపై దృష్టి పెట్టిన ఆమె ఇటీవల ఓ బిజినెస్‌ మ్యాన్‌తో ప్రేమయాణం నడుపుతున్నట్లు ఫిలీం దూనియాలో వినికిడి. అంతేగాక త్వరలో అతడినే పెళ్లి కూడా చేసుకొబోతుందనే వార్త కూడా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే దీనిపై త్రిష ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు కానీ ఓ ఇంటర్వ్యూలో తను ఖచ్చితంగా ప్రేమ వివాహమే చేసుకుంటానని తెగేసి చెప్పింది. ఈ సందర్భంగా ఎలాంటి వరుడు కావాలనే ప్రశ్న తనకు ఎదురైయింది.

దీనిపై త్రిష స్పందిస్తూ.. పెద్ద‌గా అంద‌గాడేమీ అవ‌స‌రం లేద‌ని.. కేవ‌లం త‌న‌ను బాగా చూసుకునే వాడైతే చాలని, ఇక హీరోలా ఉండాల‌నే రిక్వైర్మెంట్స్ కూడా తనకు లేదంటూ తనకు న‌లుపు అంటే ఇష్ట‌మని చెప్పుకొచ్చింది. అంతేగాక ఇంట్లో వాళ్లు చూపించిన వ్యక్తిని మాత్రం అసలు చేసుకొనని, ప్రేమ వివాహమే చేసుకుంటాన‌ని తెలిపింది. దీంతో త్రిష తీరు చూసిన వారంతా ఆమె ఎవరితోనో ఘాటు ప్రేమలో ఉందని, త్వరలోనే ప్రేమ వివాహం చేసుకొనుందని భావిస్తున్నారు. దీనికి తోడు అప్పటి హీరోయిన్లంతా ఒక్కొక్కరుగా పెళ్లి బాట పడుతూ వైవాహిక బంధంలో అడుగుపెడుతుండటంతో ఆమె సరీయస్‌గానే పెళ్లి గురించి ఆలోచిస్తున్నట్లుగా సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. 

చదవండి: 
యాంకర్‌ సుమ తల్లి వీడియో.. 70 ఏళ్ల వయసులో కూడా..

నా లోపం చాలా చిన్నది, అందుకే వద్దనుకున్న: అలయ

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు