ముందు సాయం... తర్వాతే సంబరం!

6 May, 2021 00:23 IST|Sakshi

ఈ ఏడాది తన పుట్టినరోజు (మే 4) వేడుకలను జరుపుకోలేదు త్రిష. ఈ విషయం గురించి ఆమె సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తూ– ‘‘మీ విలువైన సమయంలో కొంత నాకు కేటాయించి మీ (అభిమానులు, శ్రేయోభిలాషులు) ప్రేమతో నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. కానీ కరోనా సెకండ్‌ వేవ్‌ వల్ల ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు అందర్నీ కంగారు పెడుతున్నాయి. ఆందోళన కలిగిస్తున్నాయి.

ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సరైనది కాదని నా భావన. ప్రపంచంలో కరోనా ప్రభావం కనుమరుగై మునుపటి సాధారణ పరిస్థితులు వచ్చినప్పుడు వేడుకలు జరుపుకుందాం. అప్పటివరకు కోవిడ్‌ బాధితులకు మనకు చేతనైనంత సాయం చేద్దాం. అలాగే మనం కూడా జాగ్రత్తగా ఉందాం’’ అని పేర్కొన్నారు త్రిష. గత నెల 14న త్రిష నటించిన ‘పరమపదమ్‌ విలయాట్టు’ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైంది. అలాగే త్రిష నటించిన మరో చిత్రం ‘రాంగీ’ కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల కానుందనే ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు