యస్‌.. పోలీస్‌

31 Jul, 2020 05:14 IST|Sakshi

రౌడీలను రప్ఫాడించడానికి త్రిష రెడీ అవుతున్నారు. ఎదుటి వ్యక్తి ఎలాంటివాడైనా అన్యాయం చేస్తే లాకప్‌లో లాక్‌ చేసేస్తారు. ఎందుకంటే ఆమె పోలీసాఫీసర్‌ కాబట్టి. దాదాపు 17 ఏళ్ల కెరీర్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో కథానాయికగా నటించిన త్రిష ఇప్పటివరకూ పోలీస్‌ పాత్ర చేయలేదు.

ఇప్పుడు ‘కుట్రపయిర్చి’ అనే తమిళ చిత్రంలో ఆ పాత్ర చేసే అవకాశం వచ్చిందని సమాచారం. ‘పోలీస్‌గా చేయడానికి యస్‌’ అని కథ వినగానే త్రిష గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. త్రిష, ప్రియమణి ప్రధాన పాత్రల్లో ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో అసలు సిసలైన పోలీసాఫీసర్‌గా ఒదిగిపోవడానికి త్రిష ప్రస్తుతం రియల్‌ లైఫ్‌ పోలీస్‌లను గమనిస్తున్నారట. త్వరలో ఈ చిత్రం షూటింగ్‌ ఆరంభం కానుంది.

మరిన్ని వార్తలు