చోళ రాణి ‘కుందవై’కి డబ్బింగ్‌ చెబుతున్న త్రిష

10 Oct, 2021 15:15 IST|Sakshi

చోళ రాణి  ‘కుందవై’ స్పీకింగ్‌ అంటున్నారు త్రిష. కుందవై ఎవరంటే... త్రిషనే. ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చిత్రంలో ఆమె చేసిన పాత్ర పేరు ఇది. మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్యా లక్ష్మీ, శోభితా ధూలిపాళ్ళ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే ముగిసింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. ఇందులో చోళ రాణి కుందవై పాత్ర చేసినత్రిష ‘చోళ రాణి స్పీకింగ్‌’ అంటూ ప్రస్తుతం ఆ పాత్రకు డబ్బింగ్‌ చెబుతున్నారు.

నిజానికి త్రిష మాతృభాష తమిళం అయినప్పటికీ తన పాత్రలకు పెద్దగా డబ్బింగ్‌ చెప్పుకోరు. ఇప్పటివరకూ ఓ ఐదు చిత్రాలకు మాత్రమే చెప్పారట. చాలా గ్యాప్‌ తర్వాత మళ్లీ తన పాత్రకు త్రిష సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకుంటున్న సినిమా ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ అని కోలీవుడ్‌ టాక్‌. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా తొలి భాగం వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్‌ కానుంది.

మరిన్ని వార్తలు