మా నాన్న జీవితం స్ఫూర్తిదాయకం

14 Dec, 2020 06:18 IST|Sakshi

‘‘మా నాన్నను చూస్తే నాకు గర్వంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఏ విషయాన్నీ దాచలేదు. తాను డ్రగ్స్‌కి బానిస అయిన విషయాన్ని ఓపెన్‌గా చెప్పి, అందులోంచి బయటకు రావడానికి సహాయం కూడా కోరారు’’ అంటున్నారు త్రిషాలా దత్‌... డాటర్‌ ఆఫ్‌ సంజయ్‌ దత్‌. ఇంకా ఈ విషయం గురించి త్రిషాలా మాట్లాడుతూ – ‘‘గతంలో నా తండ్రి డ్రగ్స్‌కు అలవాటు పడ్డారు. తనకు తానుగా డ్రగ్స్‌ తీసుకుంటున్నానని ఒప్పుకోవటమే కాకుండా దాన్నుండి బయటపడటానికి సాయం చేయమని అడిగారు.

ఈ విషయం చెప్పటానికి నేను సిగ్గుపడటం లేదు. ఒక చెడు అలవాటుకి బానిస అయి, అందులోంచి బయటకు రావడం అనేది చిన్న విషయం కాదు. మానేసే క్రమంలో డ్రగ్స్‌ తీసుకోకపోయినా ప్రతి రోజూ ఆయన తనతో తాను పోరాడాల్సి వచ్చింది. అందుకే నా తండ్రి జీవితం స్ఫూర్తిదాయకం’’ అన్నారు. ఇటీవల సంజయ్‌ క్యాన్సర్‌ని జయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ప్యాన్‌ ఇండియా చిత్రం ‘కేజీఎఫ్‌–2’లో అధీరా పాత్రలో నటిస్తున్నారు. ఇంకా పలు చిత్రాల్లో నటిస్తూ యాక్టివ్‌గా ఉన్నారు సంజయ్‌ దత్‌.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు