త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో ఎన్టీఆర్; మొత్తం 60 ఎపిసోడ్‌లు!

25 Feb, 2021 19:11 IST|Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి, నాగార్జున సరసన జూనియర్‌ ఎన్టీఆర్‌ చేరబోతున్నారు. అయితే ఇది సిల్వర్‌ స్క్రీన్‌పై మాత్రం కాదు. బుల్లితెర మీద హోస్ట్‌గా అలరించేందుకు జూనియర్‌ ఎన్టీఆర్‌ మరోసారి రంగంలోకి దిగనున్నాడు. ఇప్పటికే బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌కు ఎన్టీఆర్‌ వ్యాఖ్యతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆ షో బ్లాక్‌బస్టర్ అయింది. తాజాగా మరో షోలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాడు. అదే మీలో ఎవరు కోటీశ్వరుడు. ఇప్పటి వరకు నాలుగు సీజన్‌లు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం అయిదో సీజన్‌ త్వరలో రానుందని ఊహాగానాలు ఊపందుకున్నాయి. మొదటి మూడు నాగార్జున హోస్ట్‌ చేయగా నాలుగో సీజన్‌కు చిరంజీవి వ్యాఖ్యతగా వ్యవహరించాడు. అయితే ఈసారి షోకు జూనియర్‌ హోస్ట్‌ చేయనున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేగాక నాలుగు సీజన్లు స్టార్‌ మాలో ప్రసారం కాగా.. కొత్త సీజన్‌ మాత్రం జెమిని ఛానల్‌లో టెలికాస్ట్‌ కానుంది.

కాగా ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోను కాస్తా కొత్తగా ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ అని పేరు మార్చి తీసుకొస్తున్నారు. ఈ ప్రోగ్రాం ఏప్రిల్‌ చివరిలో లేదా మే తొలి వారంలో ప్రారంభం కానుందని తెలుస్తోంది. అయితే ఇందుకు ఇప్పటి నుంచే కార్యక్రమానికి కావాల్సిన పబ్లిసిటిని తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో షో ప్రోమోను రూపొందించే పనిలో యూనిట్‌ బిజీగా ఉంది. ఈ మేరకు గురువారం జూనియర్‌ ఎన్టీఆర్‌తో షోకు సంబంధించిన ఓ యాడ్‌ను షూట్‌ చేస్తున్నట్లు సమాచారం. దీనిని టాలీవుడ్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో షూట్‌ చేస్తున్నారు. స్టార్‌ సంస్థ ఇచ్చిన ఐడియాను కన్సెప్ట్‌గా మార్చి తన స్టయిల్‌లో త్రివిక్రమ్‌ చిత్రీకరిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన సెట్లో జరిగిన ఈ ప్రోమోను మార్చి మొదట్లో విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ప్రోమో, షోకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

కాగా చిరు, నాగ్ ఇద్దరూ హోస్టింగ్ చేసినప్పుడు ఎన్టీఆర్ గెస్ట్‌గా వచ్చారు. ఇప్పుడు అలాంటి ఓ సరికొత్త రియాలిటీ షోకి ఆయనే హోస్టింగ్ చెయ్యబోతుండడం విశేషం.. ఎమ్‌ఈకే  కోసం ఎన్టీఆర్ మొత్తం 60 ఎపిసోడ్‌లు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు‌ భారీ మొత్తంలోనే రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు తమ హీరోను బుల్లితెరపై కనులారా చూసుకునేందుకు అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 
చదవండి: ఆ దర్శకుడికి నేను పెద్ద ఫ్యాన్‌: జూనియర్‌ ఎ‌న్టీఆర్

మోసగాళ్లు ట్రైలర్‌.. ఇంత డబ్బు ఎక్కడ దాచిపెట్టాలి!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు