Lucky Bhaskar Movie Update: మీనాక్షి చౌదరినే కావాలని పట్టుబట్టిన త్రివిక్రమ్‌ భార్య

25 Sep, 2023 12:43 IST|Sakshi

త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్‌లో ప్రముఖ దర్శకనిర్మాతలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. అతను ఇటీవల చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టాడు. సినిమాకు సంబంధించిన పలు పనుల్లో అతని భార్య సాయి సౌజన్య కూడా చురుకుగా పాల్గొంటున్నారు. స్క్రిప్ట్ డిస్కషన్స్‌లో కూడా సౌజన్య పాల్గొంటోంది. ఇప్పుడు, ఆమె సితార ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి దుల్కర్ సల్మాన్ నటిస్తున్న మొదటి స్ట్రైట్‌ తెలుగు సినిమా లక్కీ భాస్కర్‌ని నిర్మిస్తోంది.

(ఇదీ చదవండి: రవితేజ, విజయ్‌ దేవరకొండ ఎవరైతే ఏంటి.. శ్రీలీల పరిస్థితి ఇదీ!)

అయితే ఆశ్చర్యకరంగా ఈ సినిమాలో కథానాయికగా మీనాక్షి చౌదరిని టీమ్ ఎంపిక చేసింది. మీనాక్షి చౌదరి మహేష్ బాబు గుంటూరు కారం కోసం త్రివిక్రమ్ కాంపౌండ్‌లోకి ప్రవేశించింది. ఆమె ఈ చిత్రంలో ద్వితీయ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే ధనుష్‌ తొలి తెలుగు స్ట్రైట్‌ మూవీ అయిన 'సార్‌'ను  వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఇప్పుడు దుల్కర్‌ సినిమాను కూడా ఆయన తెరకెక్కించనున్నారు.  

లక్కీ భాస్కర్‌లో దుల్కర్‌కు సరిజోడిగా  మీనాక్షి అయితే బాగుంటుందని సౌజన్య  పట్టుబట్టి మరీ తీసుకున్నారట. ఒక సాధారణ మనిషి ఉన్నత శిఖరాలకు చేరిన అసాధారణమైన ప్రయాణంగా ‘లక్కీ భాస్కర్‌’ రూపొందుతోందని డైరెక్టర్‌ చెప్పారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు తాజాగా హైదరాబాద్‌లో జరిగాయి. ఈ కార్యక్రమంలో త్రివిక్రమ్‌ సతీమణి సౌజన్యతో  మీనాక్షి చౌదరి దిగిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌పై సూర్యదేవర నాగవంశీ, సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్‌ కుమార్‌.

మరిన్ని వార్తలు