నెటిజన్‌కు రివర్స్‌ కౌంటరిచ్చిన హీరో

5 Jan, 2021 14:18 IST|Sakshi

సినీ సెలబ్రిటీలు ట్రోలింగ్‌ బారిన పడటం సర్వసాధారణమైంది. తాజాగా ఈ లిస్టులో హీరో మాధవన్‌ వచ్చి చేరారు. ప్రస్తుతం తను నటించిన మారా రిలీజ్‌ కోసం ఎదురు చూస్తున్న ఆయనను సోషల్‌ మీడియాలో ఓ నెటిజన్‌ కించపరుస్తూ మాట్లాడింది. "మ్యాడీ(మాధవన్‌)కి పెద్ద అభిమానిని. కానీ అతడు తాగుడుకు బానిసై, డ్రగ్స్‌కు అలవాటు పడుతూ అటు కెరీర్‌ను, ఇటు ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం చూడలేకపోతున్నాను. రెహ్నా హై తేరా దిల్‌ మే.. చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టినప్పుడు ఎలా ఉండేవాడు? ఇప్పుడెలా తయారయ్యాడు? అసలేం చేస్తున్నాడనో అతడి ముఖం చూస్తేనే తెలుస్తోంది" అని కామెంట్‌ చేసింది.

మీ పేషెంట్లను చూస్తుంటే జాలేస్తోంది..
సాధారణంగా ఇలాంటి నెగెటివిటీని సెలబ్రిటీలు పెద్దగా పట్టించుకోరు. కానీ మాధవన్‌కు మాత్రం ఈ కామెంట్‌ చూడగానే కోపం నషాళానికంటింది. దీంతో ఆమె వ్యాఖ్యాలకు ధీటుగా కౌంటర్లిస్తూ ట్వీట్‌ చేశారు. "ఓహో‌.. ఇదన్నమాట మీరు చేసేది? పాపం, మీ పేషెంట్లను చూస్తుంటే నాకు జాలేస్తోంది. నాకు తెలిసి నువ్వు వీలైనంత త్వరగా డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకోవడం మంచిది" అంటూ వ్యంగ్యంగా కౌంటరిచ్చారు. అటు మాధవన్‌ అభిమానులు కూడా హీరోను సమర్థిస్తూ సదరు నెటిజన్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. బాలీవుడ్‌లో ఎవరో డ్రగ్స్‌ తీసుకున్నారని మా హీరోను అనుమానిస్తే బాగోదని హెచ్చరిస్తున్నారు. ఆమెకేదైనా చూపు మందగించిందేమోనని కామెంట్లు చేస్తున్నారు. (చదవండి: సారీ బాస్‌, ఎస్‌ బాస్‌.. 30 ఏళ్లు ఇవే డైలాగులు)

సైంటిస్ట్‌ మూవీలో మాధవన్‌
ఇదిలా వుండగా మాధవన్‌ ప్రస్తుతం 'మారా' సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం జనవరి 8న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది. దుల్కర్‌ సల్మాన్‌, పార్వతి ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం 'చార్లీ'కి ఇది రీమేక్‌. ఇందులో స్టాండప్‌ కమెడియన్‌ అలెగ్జాండర్‌ బాబు కూడా నటించారు. ప్రస్తుతం మాధవన్‌ 'రాకెట్రీ: ద నంబి ఎఫెక్ట్‌' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. (చదవండి: నాకు నీ గురించి అన్నీ తెలుసు: చై)

మరిన్ని వార్తలు