Aryan Khan: లెదర్‌ జాకెట్‌ రూ.2. లక్షలా.. షారుక్‌ తనయుడిపై ట్రోలింగ్‌.. మరీ ఈ రేంజ్‌లోనా?

3 May, 2023 08:54 IST|Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ సొంతంగా దుస్తుల బిజినెస్‌ ప్రారంభించాడు. డి యావోల్‌ ఎక్స్‌ పేరిట బ్రాండెడ్‌ బట్టలను విక్రయిస్తూ ఫ్యాషన్‌ పరిశ్రమలో అడుగుపెట్టాడు. అయితే ఆ దుస్తుల రేట్లు చూసి గుడ్లు తేలేస్తున్నారు నెటిజన్లు.

ఒక్కో టీ షర్ట్‌ ధర రూ.22,000-24,000 మధ్య ఉంది. లెదర్‌ జాకెట్‌ ధర ఏకంగా రూ.2 లక్షలుగా నిర్ణయించారు. ఇతరత్రా హుడీలైతే రూ.45,000 పైనే ఉన్నాయి. అయినప్పటికీ అలా తను సేల్స్‌ ప్రారంభించాడో లేదో ఒక్క రోజులోనే అన్నీ అమ్ముడు పోవడం విశేషం. ఈ విషయాన్ని ఆర్యన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియజేశాడు. నెక్స్ట్‌ సేల్‌ కోసం రెడీగా ఉండండని పోస్ట్‌ చేశాడు.

అయితే ఆ రేట్లు చూసి షాకైన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నాడు. 'దయచేసి నా కిడ్నీ తీసుకుంటారా?', 'ఓరి భగవంతుడా, నన్ను ఎందుకు ఇంత పేదవాడిగా పుట్టించావు. రూ.2 లక్షల జాకెట్‌ నాక్కూడా కావాలి', 'అయ్యో, రెండు ఎకరాలు అమ్మేసి డబ్బులు రెడీ చేసుకుంటే తీరా అన్నీ అమ్ముడుపోయాయని అంటున్నారే' అంటూ ట్రోల్‌ చేస్తున్నారు.

A post shared by @dyavol.x

A post shared by Aryan Khan (@___aryan___)

చదవండి: బాక్సాఫీస్‌ను ఆవహించేందుకు వస్తున్న ఆత్మకథలివే

మరిన్ని వార్తలు