Trolls On Anchor Ravi: యాంకర్‌ రవి ఇంటికి పోలీసులు.. 30 సెకన్లు ఆలోచించండంటూ విజ్ఞప్తి

16 Dec, 2021 12:59 IST|Sakshi

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సెలబ్రిటీలపై ట్రోల్స్ సర్వసాధారణంగా మారిపోయింది. అయితే వాటిని కొంతమంది లైట్‌గా తీసుకోని పట్టికోకుండా వదిలేస్తే.. మరికొంతమంది మాత్రం సీరియస్‌గా తీసుకుంటారు. తమపై అతస్య ప్రచారాలు చేసేవారిపై పోలీసులకు ఫిర్యాలు చేసి, శిక్ష పడేలా చేస్తారు. తాజాగా యాంకర్‌ రవి కూడా అదే పని చేశాడు. తనపై, తన కుటుంబ సభ్యులపై నెగిటివ్‌ కామెంట్స్‌ చేస్తున్న నెటిజన్స్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

బిగ్‌బాస్‌ షో నుంచి బయటకు వచ్చాక.. తనను, తన కుటుంబ సభ్యులపై ట్రోలింగ్‌కు గురి చేస్తున్నారని రవి వాపోయాడు. తనపై బ్యాడ్‌ కామెంట్స్‌ పెడుతున్న వారిని అస్సలు వదిలి పెట్టనని హెచ్చరించాడు. తన పరువుకు భంగం కలిగించేలా పోస్టులు పెడుతున్న వారి వివరాలను సేకరించి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేసిన రవి.. ఈ సారి ఏకంగా పోలీసులను తన ఇంటికి పిలిపించుకొని ఆధారాలు, స్క్రీన్‌ షాట్స్‌ అందించాడు. దీనికి సంబంధించిన వీడియోని రవి తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్‌ చేస్తూ.. మీరు చేయాలనుకున్నది మీరు చేయండి.. నేను చేయాల్సింది చేస్తా. కానీ ఒకరికి ఒక నెగిటివ్ కామెంట్, రిప్లై పెట్టే ముందు 30 సెకన్లు ఆలోచించండి. ఇక సోషల్ మీడియాలో చెత్తను క్లీన్ చేద్ధాం.. సోషల్ మీడియాలో దుర్భాషకు వ్యతిరేకంగా పోరాడుదామనే హ్యాష్ ట్యాగులతో రవి  ఈ వీడియోని పోస్ట్ చేశాడు. 

A post shared by Anchor Ravi (@anchorravi_offl)

మరిన్ని వార్తలు