సినీ గోయర్స్‌ అవార్డుల ప్రదానం 

9 Oct, 2021 10:28 IST|Sakshi

మాదాపూర్‌: మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో శుక్రవారం సినీ గోయర్స్‌ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సినీ రంగంపై ఆధారపడి ఎంతోమంది ఉపాధి పొందుతున్నారని అన్నారు. సినీ రంగం ద్వారా మంచి విషయాలను సమాజానికి త్వరితగతిన తెలియజేయవచ్చని పేర్కొన్నారు. ఇది మంచి పరిణామం అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్‌కు లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డ్‌ను ఇచ్చారు. వివిధ రంగాలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి  అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు రమణాచారి, రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, నటులు అల్లరి నరేశ్‌, నాని, ప్రకాశ్‌రాజ్, జయప్రద, ఫైట్‌ మాస్టర్‌ రామ్‌లక్ష్మణ్, కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ తదితరులు పాల్గొన్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు