రాజమహేంద్రవరంలో ‘టక్‌ జగదీష్‌’

28 Mar, 2021 13:53 IST|Sakshi

సందడి చేసిన నేచురల్‌ స్టార్‌ నాని

ఘనంగా పరిచయ వేడుక

రాజమహేంద్రవరం రూరల్‌: నగరంలో ‘టక్‌ జగదీష్‌’ సందడి చేశాడు. షైన్‌ స్క్రీన్స్‌ సమర్పణలో సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మాతలుగా, శివ నిర్వాణ దర్శకత్వంలో, నేచురల్‌ స్టార్‌ నాని, రీతూవర్మ హీరో హీరోయిన్లుగా నటించిన ‘టక్‌ జగదీష్‌’ సినిమా పరిచయ వేడుక వీఎల్‌ పురం మార్గాని ఎసేట్స్‌లో శనివారం రాత్రి ఘ నంగా జరిగింది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ఈ సినిమా బ్యూటిఫుల్‌ ఎమోషనల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అని అన్నారు. సినిమాలోని ఒక్కో పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేశారు.

సినిమా రిలీజ్‌ ఈవెంట్, సక్సెస్‌ మీట్‌లకు వెళ్లేటప్పుడు ఇంటి వద్ద అమ్మ ఆశీర్వాదం తీసుకోవడం అంటూ.. నాని వేదిక దిగి వచ్చి ఒక తల్లి కాళ్లకు నమస్కరించి, ఆశీర్వాదం తీసుకున్నాడు. తల్లిదండ్రులు గర్వపడేలా తన అభిమానులు ఉండాలని ఫ్యాన్స్‌కు నాని సూచించాడు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజమహేంద్రవరం ఎంపీ, వైఎస్సార్‌ సీపీ పార్లమెంటరీ చీఫ్‌ విప్‌ మార్గాని భరత్‌రామ్‌ మాట్లాడుతూ, తెలుగు సినీ పరిశ్రమకు నగరాన్ని హబ్‌గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానన్నారు. టక్‌ జగదీష్‌ టీమ్‌కు శుభాకాంక్షలు చెబుతూ, ఈ సినిమా సూపర్‌హిట్‌ అయ్యి, నాని సినీ జీవితంలో మైలురాయిగా నిలవాలని ఆకాంక్షించారు.

దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ, టక్‌ జగదీష్‌ చిత్రంలో జగపతిబాబు, నాని అన్నదమ్ములుగా నటించి అందరినీ అలరించనున్నారన్నారు. తొలుత ఎంపీ భరత్‌రామ్‌ చేతుల మీదుగా సినిమాలోని పాట ‘నీటి నీటి చుక్క’ లిరిక్‌ను విడుదల చేయించారు. నటుడు నరేష్‌, నిర్మాతలు సాహు గారపాటి, రాహుల్‌ పెద్ది, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ వెంకటరత్నం, ఆదిత్య మ్యూజిక్‌ నిరంజన్, అనుశ్రీ ఫిలింస్‌ అధినేత ఆల్తి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, టీ టైమ్‌ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. ఎంపీ, భరత్‌రామ్‌ చేపట్టిన హరిత – యువత కార్యక్రమంలో భాగంగా మార్గాని ఎస్టేట్స్‌లో హీరో నాని మొక్క నాటారు. ఈ సందర్భంగా ఆయనను ఎంపీ భరత్‌రామ్‌ ఘనంగా సత్కరించారు.
చదవండి: 
‘ఈ కథలో పాత్రలు కల్పితం’ మూవీ రివ్యూ 
చెర్రీ బర్త్‌డే: మరో సినిమా అప్‌డేట్‌ కూడా వచ్చేసింది 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు