డబ్బింగ్‌ జగదీష్‌

5 Jan, 2021 06:26 IST|Sakshi

తాజా చిత్రం కోసం టక్‌ జగదీష్‌గా మారారు నాని. ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్‌ కార్యక్రమాల్లో ఉంది. ‘నిన్ను కోరి’ తర్వాత నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘టక్‌ జగదీష్‌’. ఐశ్వర్యా రాజేష్, రీతూ వర్మ కథానాయికలు. సాహూ గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్‌ పనులను సోమవారం ప్రారంభించారు నాని. ఈ సినిమాను వేసవికి విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

మరిన్ని వార్తలు