Tuck Jagadish Trailer: టక్‌ జగదీష్‌ ట్రైలర్‌ వచ్చేసింది

1 Sep, 2021 18:23 IST|Sakshi

Tuck Jagadish Trailer: నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటించిన చిత్రం 'టక్‌ జగదీష్‌'. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్  హీరోయిన్లుగా కనిపించనున్నారు. 'నిన్ను కోరి' వంటి సూపర్‌ హిట్‌ చిత్రాన్ని అందించిన శివ నిర్వాణ ఈ సినిమాను డైరెక్ట్‌ చేస్తున్నాడు. బుధవారం ఈ సినిమా ట్రైలర్‌ రిలీజైంది. భూదేవి కొడుకు గురించి ఒక కథ చెప్పాలి అన్న డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభమైంది. ఇందులో నాయుడుగారి అబ్బాయి టక్‌ జగదీష్‌గా నాని తన లుక్‌తో, పర్ఫామెన్స్‌తో, ఎమోషనల్‌ సీన్స్‌తో అదరగొట్టాడు.

'అయినోళ్ల కంటే ఆస్తులు, పొలం ఎక్కువ కాదు, రక్త సంబంధం విలువేంటో తెలుసుకోరా..' అంటూ నానికి మంచి విషయాలు బోధిస్తున్నాడు అతడికి అన్నయ్య పాత్రలో నటించిన జగపతిబాబు. 'భూ కక్షలు లేని భూదేవిపురం చూడాలనేది మా నాన్న కోరిక, ఇప్పుడది నా బాధ్యత', 'నా కుటుంబం ఓడిపోతే నేను ఓడిపోయినట్లే' అంటున్నాడు నాని. 

కుటుంబం అంటే పిచ్చిగా ప్రేమించే హీరోకు ఎదురైన సమస్యలేంటి? అతడి తండ్రి చనిపోవడానికి కారణమేంటి? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌లో సెప్టెంబర్‌ 10న రిలీజ్‌ కానుంది. షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించిన ఈ చిత్రంలో జగపతి బాబు కీలక పాత్ర పోషించారు. ఎస్‌ఎస్‌ థమన్ సంగీతం అందించారు.

>
Poll
Loading...
మరిన్ని వార్తలు