శ్రీవల్లి కళ్యాణంకి శ్రీకారం

10 Sep, 2022 02:16 IST|Sakshi
రామ సత్యనారాయణ, శ్రీనివాస్, రాఘవేంద్ర రావు

చిన్న చిత్రాల నిర్మాతగా కెరీర్‌ని ఆరంభించిన తుమ్మలపల్లి రామసత్యనారాయణ నూరవ చిత్రాన్ని నిర్మించే సన్నాహాల్లో ఉన్నారు. భీమవరం టాకీస్‌పై ఈ ల్యాండ్‌ మార్క్‌ చిత్రాన్ని కె. రాఘవేంద్ర రావుతో నిర్మించనున్నట్లు శుక్రవారం రామసత్యనారాయణ తెలిపారు.

నేడు రామసత్యనారాయణ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ‘‘త్వరలోనే ‘శ్రీవల్లి కళ్యాణం’ చిత్రం షూటింగ్‌ ప్రారంభిస్తాం. వచ్చే ఏడాది విడుదల చేస్తాం. సుమన్, రవళి జంటగా నిర్మించిన ‘ఎస్‌.పి. సింహా’తో నిర్మాతగా నా కెరీర్‌ చిన్నగా ఆరంభమైంది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలు నిర్మించాను. రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో తీసిన ‘ఐస్‌క్రీమ్‌’  పార్ట్‌ వన్, పార్ట్‌ టూలతో నిర్మాతగా నా కెరీర్‌ పుంజుకుంది.

‘ట్రాఫిక్‌’, ‘వీరుడొక్కడే’, ‘బచ్చన్‌’, ‘శీనుగాడి లవ్‌ స్టోరీ’ తదితర అనువాద చిత్రాలు లాభాలతోపాటు ఆత్మసంతృప్తిని ఇచ్చాయి. ఈ ఏడాది యండమూరి దర్శకత్వంలో సునీల్‌–బిగ్‌ బాస్‌ కౌశల్‌తో ‘అతడు ఆమె ప్రియుడు’ నిర్మించాను. యండమూరి కథతో వర్మ డైరెక్షన్‌లో ‘తులసి తీర్థం’ త్వరలో మొదలు కానుంది. అలాగే రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో నిర్మించనున్న నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌  ‘శ్రీవల్లి కళ్యాణం’ ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తి కావచ్చాయి’’ అన్నారు. 

మరిన్ని వార్తలు