నా భార్యే తలను గోడకేసి కొట్టుకుంది: టీవీ నటుడు

1 Jun, 2021 16:18 IST|Sakshi

టీవీ నటుడు కరణ్‌ మెహ్రా గురించి బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయమున్న పేరు. 'యే రిష్తా క్యా కెహ్లాతా హై' సీరియల్‌తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఇతడు అనేక టీవీ షోలలోనూ పాల్గొన్నాడు. ఈ క్రమంలో తను ప్రేమించిన నిషాను 2012లో పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ 'నాచ్‌ బలియే సీజన్‌ 5'లోనూ పాల్గొని అందరి దృష్టినీ ఆకర్షించారు. అయితే ఎంతో అన్యోన్యంగా ఉండే కరణ్‌ దంపతులు ఇప్పుడు ఒకరి మీద ఒకరు విమర్శలు గుప్పించుకోవడం అభిమానులకు మింగుడు పడటం లేదు. తనను గోడకేసి కొట్టాడని భార్య ఫిర్యాదు చేయడంతో ముంబై పోలీసులు అతడిని అరెస్ట్‌ చేయడం సంచలనంగా మారింది.

ఇక బెయిల్‌ మీద బయటకు వచ్చిన కరణ్‌ మెహ్రా భిన్న వాదన వినిపిస్తున్నాడు. అసలు తన భార్య మీద చేయి చేసుకోలేదని చెప్తున్నాడు. "నేను మా అమ్మతో ఫోన్‌కాల్‌ మాట్లాడుతున్నా.. ఇంతలో నా భార్య నిషా అరుచుకుంటూ వచ్చి నన్ను, నా తల్లిదండ్రులను, ఆఖరికి నా సోదరుడిని కూడా తిట్టడం ప్రారంభించింది. గట్టి గట్టిగా అరుస్తూ నానా రభస చేసింది"

"అంతే కాదు ఆమె వచ్చి నా ముఖం మీద ఉమ్మేసింది. దీంతో కోపంతో ఇక్కడి నుంచి బయటకు వెళ్లిపో అన్నా. అందుకు ఆమె ఇప్పుడేం చేస్తానో చూడు అంటూ తన తలను గోడకు బాదుకుంది. పైగా నేనే ఆమెను గోడకేసి కొట్టానని అందరికీ చెప్తోంది. ఆమె సోదరుడు కూడా నన్ను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నాడు" అని కరణ్‌ తెలిపాడు. అటు నిషా మాత్రం తన భర్త కరణ్‌ తన తలను గోడకేసి కొట్టి హింసించాడని పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. మరి వీరిద్దరి ఆరోపణల్లో ఎవరిది నిజం? ఎవరిది అబద్ధం? అనేది పోలీసులు తేల్చాల్సి ఉంది.

చదవండి: బుల్లితెర నటుడు కరణ్‌ అరెస్ట్‌.. ఆ వెంటనే బెయిల్‌

4 వారాలు..4 సినిమాలు..క‌ట్టిపడేసే కంటెంట్‌తో ‘ఆహా’ రెడీ

మరిన్ని వార్తలు