నటుడి ప్రేమ వివాహం: ఇప్పటికీ నమ్మలేకపోతున్నా

26 Feb, 2021 10:47 IST|Sakshi

లాక్‌డౌన్‌లో సామన్యులతో పాటు సెలబ్రిటీల పెళ్లిళ్లు కూడా వాయిదా పడ్డాయి. ఇప్పుడిప్పుడే వారంతా శుభ ముహూర్తాలు చూసుకుంటూ లగ్న పత్రికలు రాయించేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవలే టీవీ నటుడు కృష్ణ శెట్టి తన మనసు దోచుకున్న అమ్మాయితో ఏడడుగులు నడిచాడు. తన ప్రియురాలు, డెంటిస్ట్‌ ప్రగ్యాను అగ్నిసాక్షిగా పెళ్లాడాడు. మంగళూరులో జరిగిన ఈ పెళ్లికి పలువురు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కరణ్‌ కుంద్రా, పౌలొమి దాస్‌ కూడా ఈ పెళ్లిలో సందడి చేశారు. పెళ్లైన వెంటనే తన అర్ధాంగిని వెంటేసుకుని కూర్గ్‌లో హనీమూన్‌కు వెళ్లాడు కృష్ణ శెట్టి.

"నాకు పెళ్లైందన్న విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. చేతులకు, కాళ్లకు మెహందీ, కాలి వేళ్లకు రింగు చూశాక అవును, నేను నిజంగానే పెళ్లి చేసుకున్నాను అనిపిస్తోంది. కానీ ఇప్పటికీ ఇదంతా కలలా అనిపిస్తోంది. అయితే ఇదంత ఈజీగా ఏమీ జరగలేదు. నా సోదరి ద్వారా ప్రగ్యాను కలిశాను. చూడగానే ఒకరికి ఒకరం నచ్చేశాం. అయితే ప్రగ్యా తల్లిదండ్రులు మాత్రం నాతో పెళ్లంటే తర్జనభర్జన పడ్డారు. ఎందుకంటే నటుడి జీవితం ఎప్పుడెలా ఉంటుందోనని భయపడ్డారు! ఆమెను ఓ ఇంజనీర్‌కో, డాక్టర్‌కో ఇద్దామనుకున్నారు. కానీ మేమందరం ఓసారి సమావేశమైనప్పుడు మా మధ్య ఉన్న ప్రేమను చూసి వారు కూడా ఒప్పేసుకున్నారు. ఏదేమైనా అర్థం చేసుకునే అర్ధాంగి దొరకడం నా అదృష్టం" అని చెప్పుకొచ్చాడు.

A post shared by Krishna Shetty (@ikrishnashetty)

చదవండి: ‘మిస్‌ యూ అమ్మ’ శ్రీదేవి కూతుళ్ల భావోద్వేగం

మంచుకొండల్లో కల తీర్చుకుంటున్న బాలీవుడ్‌ క్వీన్‌

విడాకులు తీసుకుందామనుకున్నాం.. బిగ్‌బాస్‌ మళ్లీ కలిపింది

మరిన్ని వార్తలు