డాక్టర్‌ బాబుకు హీరో చాన్స్‌ అలా మిస్సయిందట..

13 May, 2021 14:01 IST|Sakshi

డాక్టర్‌ బాబు.. ప్రస్తుతం ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు లేరనడంలో అతిశయోక్తి లేదు. కార్తీకదీపం సీరియల్లో లీడ్‌ రోల్‌ పోషిస్తున్న నిరుపమ్‌ పరిటాల బుల్లితెర శోభన్‌బాబుగా పేరు తెచ్చుకున్నాడు. మొదట చంద్రముఖీ సీరియల్‌తో బుల్లితెరపై నటుడిగా అరంగేట్రం చేసిన నిరుపమ్‌ ఆ తర్వాత స్టార్‌ నటుడికి ఎదిగాడు.

ప్రస్తుతం నిరుపమ్‌ కార్తీకదీపంతో పాటు పలు సీరియల్లో నటిస్తూ ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఆయన భార్య మంజూలతో కలిసి ఓ షోకు అతిథిగా రానున్నాడు నిరుపమ్‌. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇందులో డాక్టర్‌ బాబు చెప్పిన ఓ ఆసక్తికర విషయం చర్చనీయాంశంగా మారింది. షో హోస్ట్‌ నిరుపమ్‌తో ‘అష్టాచమ్మా’ మూవీలో హీరో చాన్స్‌ ఎలా మిస్సయిందని అడగ్గా.. ‘ముందు ఈ మూవీ కోసం డైరెక్టర్‌ ఇంద్రగంటి మోహనకృష్ణ అడిషన్స్‌కు పిలిచారు.

ఆ తర్వాత మరుసటి రోజు కాల్‌ చేస్తే ఆడిషన్‌ లేదు నన్ను రావొద్దన్నారు. తీరా ఈ మూవీ కోసం కొత్త కుర్రాడిని తీసుకున్నట్లు తెలిసింది. బాహుశా అప్పుడు నేను సీరియల్స్‌లో నటిస్తుండం వల్ల ఆడిషన్‌కి పిలవలేదేమో అనుకున్నా’ అంటూ చెప్పకొచ్చాడు డాక్టర్‌ బాబు. కాగా 2008లో వచ్చిన అష్టాచమ్మా మూవీతో న్యాచులర్‌ స్టార్‌ నాని హీరోగా పరిచమైన సంగతి తెలిసిందే. అప్పటి వరకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పనిచేసిన నాని ఈ మూవీతో హీరోగా మారి ప్రస్తుతం స్టార్‌ హీరోగా ఎదిగాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు