సుశాంత్‌ పాత్ర చేయాలంటే భయపడేలా చేశారు: నటుడు

15 Jul, 2021 17:36 IST|Sakshi

Pavitra Rishta 2 Serial: బుల్లితెరపై ప్రభంజనం సృష్టించిన 'పవిత్ర రిష్తా' సీరియల్‌ ఇప్పుడు రెండో సీజన్‌ రాబోతోంది. ఇందులో దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మానవ్‌ పాత్రలను ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ రెండో సీజన్‌లో సుశాంత్‌ మానవ్‌ పాత్రలో ప్రముఖ బుల్లితెర నటుడు షాహీర్‌ షేక్‌ నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో షాహిర్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పలు ఆస్తికర విషయాలను పంచుకున్నాడు. అలాగే పవిత్ర రిష్తాలో మానవ్‌ పాత్రకు తాను ఒకే చెప్పడంతో చాలా మంది తనని భయపెట్టారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. షాహిర్‌ మాట్లాడుతూ.. ‘ఈ ఆఫర్‌ రాగానే చాలా ఎక్జైయిట్‌ అయ్యాను. కానీ కొంతమంది నా దగ్గరకి వచ్చి నిజంగానే నువ్వు ఈ మానవ్‌ పాత్ర చేయడానికి సిద్దంగా ఉన్నావా? అని ప్రశ్నించడం మొదలు పెట్టారు.

ఎందుకంటే ఎంతో పాపులర్‌ అయిన సీరియల్‌ ఇది. అంతేగాక లెజెండరీ నటుడు సుశాంత్‌ చేసిన పాత్ర కావడంతో ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలు పెరిగిపోతాయని హెచ్చరించారు. ఇవి అన్ని విని నాలో భయం మొదలైంది. ఈ పాత్ర చేయాలా వద్దా? అని ఆలోచనలో పడిపోయాను’ అంటూ చెప్పుకొచ్చాడు. అంతేగాక ‘మహాభారతం సీరియల్‌ సమయంలో కూడా అర్జునుడు పాత్రకు కూడా అంతే భయపడ్డాను. ఈ పాత్ర నేను చేయగలనా? లేదా? అని ఆలోచించాను. కానీ పట్టుదలతో ప్రయత్నిస్తే తప్పుకుండా సక్సెస్‌ అవుతామనే సిద్దాంతాన్ని గట్టిగా నమ్ముతాను. అలా మహభారతంలో నటించడానికి ఒప్పుకున్న. ఇప్పుడు మానవ్‌ పాత్రకు కూడా అలాంటి పరిస్థితియే ఎదురైంది. దీంతో ఈ దీన్ని చాలెంజీంగ్‌ తీసుకున్నాను. ప్రయత్నించకుండానే అవకాశాన్ని వదులుకోవడం కరెక్ట్‌ కాదు అనుకున్న. అందుకే పవిత్ర రిష్తాలో నటించడాలని గట్టిగా నిర్ణయించుకున్నా’ అని పేర్కొ‍న్నాడు.

కాగా ‘పవిత్ర రిష్తా 2’లో అర్చన పాత్రలో అంకిత లోఖండే నటిస్తుంది. అయితే ఈ సీరియల్‌ను ప్రకటించగానే సుశాంత్‌ అభిమానులు ఈ సీరియల్‌పై విమర్శలు గుప్పించారు. మానవ్‌ పాత్రలో వేరొకరిని ఊహించుకోలేమని, సుశాంత్‌ వల్లే పవిత్ర రిష్తా సీరియల్‌ హిట్టయిందని, అలాంటిది అతడు లేకుండా రెండో సీజన్‌ ఎలా తీస్తారని ప్రశ్నిస్తున్నారు. ‘మానవ్‌ అంటే ఒక పేరు కాదు, అది ఒక ఎమోషన్‌.. మానవ్‌ 2గా సుశాంత్‌ను కాకుండా మరొకరిని ఊహించుకోలేం’ అంటూ #BoycottPavitraRishta2 అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు. ఇక సుశాంత్‌ అంటే నిజమైన ప్రేమే ఉంటే అంకిత ఈ సీరియల్‌లో నటించేందుకు ఒప్పుకునేదే కాదని అంకిత లోఖండేను కూడా విమర్శిస్తున్నారు.

A post shared by ALTBalaji (@altbalaji)

మరిన్ని వార్తలు