టీవీ నటితో ‘సావిత్రమ్మ గారి అబ్బాయి’ హీరో పెళ్లి.. ఫోటోలు వైరల్‌

15 May, 2021 10:17 IST|Sakshi

టీవీ నటుడు, సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్‌ హీరో బాలు (చందన్‌ కుమార్‌), నటి కవిత గౌడలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కరోనా నిబంధనలు పాటిస్తూ కేవలం ఇరుకుంటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల మధ్య శుక్రవారం వీరి పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఇటీవల వీరి నిశ్చితార్థం కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో రహస్యంగా జరిగిన సంగతి తెలిసిందే. కన్నడ లక్ష్మీ బారమ్మ(2013) సీరియల్లో వీరిద్దరూ చిన్ను, చందుగా ప్రధాన పాత్రలు పోషించారు. అదే సమయంలో ప్రేమలో పడిన చందన్‌, కవితలు అప్పటి నుంచి డేటింగ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో నిన్న(మే 14) పెద్దల సమక్షంలో ప్రేమ పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు.

దీంతో వీరికి సినీ ప్రముఖలు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక పెళ్లి అనంతరం చందన్‌ మీడియాతో మాట్లాడుతూ.. కరోనా ఆంక్షలు అన్ని ఎత్తివేసి, సాధారణ పరిస్థితులు రాగానే అందరిని పిలిచి గ్రాండ్‌గా రిసెప్షన్‌ పార్టీ నిర్వహించాలనుకుంటున్నట్లు తెలిపాడు. తమ పెళ్లిని ముందుగా అనుకున్న ముహుర్తానికే జరిపించాలని కుటుంబ సభ్యులంతా నిర్ణయించారని, దీంతో కరోనా ప్రొటోకాల్‌ నడుమ ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ తమ వివాహ తంతు జరిపించినట్లు చందన్‌ వెల్లడించాడు. అయితే మాస్క్‌తో తమ వివాహ శుభకార్యంలో పాల్గొన్న వీరి ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అవి చూసిన అభిమానులు, నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతుంటే, మరికొందరూ ‘మాస్క్‌తో ఒక్కటైన జంట’ అంటూ చమత్కరిస్తున్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు