ఘనంగా టీవీ సెలబ్రిటీల వివాహం

25 Jan, 2021 10:38 IST|Sakshi

న్యూఢిల్లీ: టీవీ సెలబ్రిటీలు కరణ్‌ వీర్‌ మెహ్రా, నిధి సేత్‌ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఆదివారం ఉదయం వీరిద్దరూ వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. న్యూఢిల్లీలోని గురుద్వారలో జరిగిన వీరి వివాహానికి ఇరు కుటుంబాలతో పాటు అతి కొద్ది మంది బంధువులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లికి రాలేకపోయిన బుల్లితెర సెలబ్రిటీల కోసం వధూవరూలిద్దరూ ముంబైలో గ్రాండ్‌ రిసెప్షన్‌ ఏర్పాటు చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. అయితే జనవరి 24వ తేదీనే ఎందుకు ముహూర్తం పెట్టుకున్నారన్న విషయాన్ని కూడా నిధి సేత్‌ గతంలోనే మీడియాకు వెల్లడించారు. 'పెళ్లెప్పుడు? అనుకున్నప్పుడు కొన్ని డేట్స్‌ అనుకున్నాం. అందులో ఒకటి డిసెంబర్‌లో కూడా వచ్చింది. అయితే 2021 నుంచే కొత్త జీవితం ప్రారంభించాలనుకున్నాం. అలా ఆన్‌లైన్‌లో ఏ రోజు మంచిదా? అని వెతుకులాడితే జనవరి 24 బ్రహ్మాండంగా ఉందని తెలిసింది. అందుకే ఆ రోజు షూటింగ్‌కు బ్రేక్‌ చెప్పేశాను. ఎందుకంటే ఆ రోజే మా పెళ్లి జరగడం ఖాయం కాబట్టి!' అని పేర్కొంది. నిన్న మరో బాలీవుడ్‌ జంట వరుణ్‌ ధావన్‌- నటాషా దళాల్‌ కూడా ఏడడుగులు నడిచిన విషయం తెలిసిందే. (చదవండి: ఆర్జీవీ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘డీ కంపెనీ’ టీజర్‌ విడుదల)

కాగా కరణ్‌ వీర్‌ మెహ్రా 2005లో 'రీమిక్స్‌' షోతో బుల్లితెరపై అడుగు పెట్టాడు. తర్వాత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి రాగిని ఎమ్‌ఎమ్‌ఎస్‌ 2, మేరే డాడ్‌కీ మారుతి, బ్లడ్‌ మనీ, బద్మాషీయాన్‌, ఆమెన్‌ వంటి పలు చిత్రాల్లో నటించాడు. 'పవిత్ర రిష్తా' సీరియల్‌లో నటనకుగానూ ప్రశంసలు దక్కించుకున్నాడు. ఆయన తన చిన్ననాటి స్నేహితురాలు దేవిక మెహ్రాను ఇదివరకే పెళ్లి చేసుకున్నప్పటికీ మనస్పర్థల కారణంగా 2009లో విడిపోయారు. తర్వాత తన సహనటి నిధి సేత్‌తో ప్రేమలో పడ్డ ఆయన ఆమెను పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ఇక నిధి సేత్‌ శ్రీమద్‌ భగ్వత్‌ మహాపురాణ్‌, మేరే డాడ్‌ కీ దుల్హాన్‌ వంటి పలు సీరియల్స్‌లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. (చదవండి: అమితాబ్‌ సెక్సిస్ట్‌ కమెంట్స్‌ దుమారం)

A post shared by KaranVeerMehra (@karanveermehra)

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు