అంత ఓవరాక్షన్‌ అక్కర్లేదు, చిరాకు పుడుతోంది: నటి

12 May, 2021 08:59 IST|Sakshi

రెండో దశలో విజృంభిస్తున్న కరోనాను అడ్డుకునేందుకు జనాలు స్వీయనియంత్రణ చర్యలు పాటిస్తున్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకునేందుకు అర్హులని ప్రభుత్వం సూచించడంతో టీకా కోసం కోవిడ్‌ సెంటర్ల ముందు బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీలు సైతం టీకా తీసుకుంటూ దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్‌ చేస్తున్నారు. వ్యాక్సిన్‌ వల్ల ఎలాంటి ప్రాణహాని ఉండదని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

అయితే ఇలా అవగాహన కల్పించడం బాగానే ఉందని, కానీ వ్యాక్సిన్‌ తీసుకుంటూ కొందరు సెలబ్రిటీలు చేసే ఓవరాక్షన్‌ చూడలేకపోతున్నాం అని నటి ఆశా నేగి విమర్శించింది. మరీ అంత ఓవర్‌ యాక్టింగ్‌ అవసరం లేదని, అది చాలా చిరాకుగా పుట్టిస్తోందని ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పుకొచ్చింది. అయితే ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేసినవో చెప్పలేదు. కానీ ఈ పోస్టుపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ఇది నటి అంకిత లోఖండే గురించేనని అభిప్రాయపడుతున్నారు.

A post shared by MsNegi (@ashanegi)

ఇటీవల అంకిత తను వ్యాక్సిన్‌ తీసుకుంటున్న వీడియోను షేర్‌ చేసింది. అందులో ఆమె తెగ భయపడిపోతూ, కేకలు పెడుతూ టీకా వేసుకుంది. కాబట్టి ఈమెపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఆశా నేగి ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని అంటున్నారు. కాగా 'పవిత్ర రిష్తా' సీరియల్‌లో దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌, అంకిత లోఖండేతో పాటు ఆశా నేగి కూడా ఓ ముఖ్య పాత్రలో నటించింది. ఆమె చివరిసారిగా కునాల్‌ కెమ్ము 'అభయ్‌ 2'లో కనిపించింది.

చదవండి: నా తల్లి, కొడుకు ఒకేసారి చనిపోయారు: నటి

ఆ  విషయాన్ని తల్లి, తండ్రి దగ్గర దాచి పెట్టిన నటి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు