కరోనాతో ఆస్పత్రిలో చేరిన నటి, భర్త ఎమోషనల్‌

11 May, 2021 20:13 IST|Sakshi

టీవీ నటి బీనా అంటోనీ కరోనాతో హాస్పిటలో చేరారని, ప్రస్తుతం వైద్యులు తనకు చికిత్స అందిస్తున్నట్లు ఆమె భర్త, నటుడు మనోజ్‌ నాయర్‌ వెల్లడించాడు. కాగా బీనా మలయాళంలో పలు టీవీ సీరియల్లో నటించి పాపులర్‌ అయ్యింది. కాగా బీనా మహమ్మారి బారిన పడటంతో ఆమె భర్త మనోజ్‌ ఓ వీడియో షేర్‌ చేస్తూ భావోద్యేగానికి లోనయ్యాడు. ఈ వీడియోలో అతడు మాట్లాడుతూ.. ‘నా జీవితంలో ఇది అత్యంత క్లిష్ట సమయం. ఎందుకంటే రెండు రోజుల క్రితం బీనా కరోనా పాజిటివ్‌గా పరీక్షించింది. 

షూటింగ్‌లో ఓ వ్యక్తికి పాజిటివ్‌ రావడంతో బీనా క్వారంటైన్‌కు వెళ్లింది. ఆ తర్వాత కొన్ని రోజులకు తనలో కూడా కోవిడ్‌ లక్షణాలు కనిపించడం మొదలయ్యాయి. ఈ క్రమంలో తన ఆరోగ్యం క్షీణించడంతో హాస్పిటల్‌లో చేర్పించాం. తనకు కోవిడ్‌ పరీక్షలు చేయించగా యాంటీజెన్‌ టెస్టులో నెగిటివ్‌ రాగా, ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులో పాజిటివ్‌గా తేలింది. ఫలితాలు రాగానే వైద్యులు చికిత్స ప్రారంభించారు. ఈ క్రమంలో బీనా నిమోనియతో బాధపడుతున్నట్లు గుర్తించిన వైద్యులు తనని ఇక్కడి నుంచి తీసుకెళ్లమని చెప్పారు. అంతేగాక ఐసీయూ సదుపాయం ఉన్న మరో హాస్పిటల్‌లో చేర్పించమని సూచించడంతో నాకేం చేయాలో తోచలేదు.

నాలో భయం మొదలైంది. ప్రస్తుతం దేవుడి దయ వల్ల తన ఆరోగ్యం కుదుటపడింది’ అంటూ మనోజ్‌ ఎమోషనల్‌ అయ్యాడు. ఈ సందర్భంగా అతడు కరోనా పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని కూడా సూచించాడు. ‘తప్పనిసరిగా మాస్క్‌లు ధరించండి. శానిటైజర్‌ ఎప్పుడు మీ వద్దే ఉంచుకొండి. కొద్ది రోజుల పాటు విందులు, వినోదాలకు దూరంగా ఉండండి. అయినప్పటికీ ఫ్యామిలీ గ్యాదరింగ్స్‌కు వెళుతూ ప్రభుత్వాన్ని, పోలీసులను ఫూల్స్‌ చేశామని విర్రవీగకండి. ఇలా చేస్తే మిమ్మల్ని మీరే వెర్రివాళ్లను చేసుకున్నట్లు. ప్లీజ్‌ ఇంట్లోనే ఉండండి, జాగ్రత్తగా ఉండంటూ’ అంటూ అతడు అభ్యర్థించాడు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు