పోర్న్‌ స్టార్‌తో స్నేహం, నాపై కూడా అదే ముద్ర: నటి

4 Jun, 2021 17:01 IST|Sakshi

పోర్న్‌ స్టార్‌ డానీ డీతో స్నేహం చేసినందుకు తన మీద సెక్స్‌ వర్కర్‌ అన్న ముద్ర వేశారని టీవీ నటి మహికా శర్మ వాపోయింది. జూన్‌ 2న ఇంటర్నేషనల్‌ సెక్స్‌ వర్కర్స్‌ డే సందర్భంగా వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సాదకబాధకాల గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

'నేను డానీ డీతో స్నేహం చేసిన విషయం ఆ మధ్య బాగా హైలైట్‌ అయింది. అప్పుడు అందరూ నన్ను సెక్స్‌ వర్కర్‌గా చూడటం మొదలు పెట్టారు. నిజానిజాలేవీ తెలుసుకోకుండానే నా మీద ఆ ముద్ర వేసి చులకగా చూస్తూ వేధించారు. అవి నా జీవితంలోనే ఇబ్బందికర రోజులు. అప్పుడే నేను శక్తిని కూడదీసుకుని ధైర్యంగా ఉండేందుకు ప్రయత్నించాను. కానీ నా పరిస్థితే ఇలా ఉంటే ఇక సెక్స్‌ వర్కర్ల జీవితాలు ఎంత దుర్భరంగా ఉంటాయో ఊహించాను'

'అందుకే వారికి అండగా నిలబడుతూ సమాజానికి వారి పట్ల అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాను. సెక్స్‌ వర్కర్లు వారి వృత్తిని వదిలేసి చదువుకునేలా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు ఈ వ్యభిచార వృత్తే అంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను.  మన దేశంలో పోర్న్‌పై నిషేధం విధించినప్పటికీ దానికి సంబంధించిన కంటెంట్‌ ఎక్కడో చోట రిలీజ్‌ అవుతూనే ఉండటం దురదృష్టకరం. వాటిని అరికట్టేందుకు కూడా మనం ఏదో ఒకటి చేయాల్సిందే' అని నటి చెప్పుకొచ్చింది. కాగా మహికా శర్మ 'రామాయణ', 'తు మేరే అగల్‌ బగల్‌ హై' సీరియల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

చదవండి: OTT: అమెజాన్‌లో ఈ వారం వచ్చిన కొత్త చిత్రాలివే!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు