Meghana Lokesh: నాకెవ్వరూ లేరు.. చచ్చిపోతానంటూ నటి మేఘన! వీడియో వైరల్‌

21 Nov, 2022 12:36 IST|Sakshi

ప్రస్తుతం బుల్లితెర, టీవీ స్టార్స్‌ సీరియల్స్‌తో పాటు సోషల్‌ మీడియాలోనూ అలరిస్తున్నారు. సొంతంగా యూట్యూబ్‌ చానల్‌ పెట్టి రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇప్పటికే నటి అంజలి, మహేశ్వరి, శ్రీవాణి, బిగ్‌బాస్‌ నటి హిమజ, అషురెడ్డితో పాటు పలువురు నటీనటులు సొంతంగా యూట్యూబ్‌ చానల్‌ రన్‌ చేస్తున్నారు. తరచూ హోంటూర్‌, డైలీ రోటిన్‌ వీడియోస్‌తోపాటు డిఫరెంట్‌ కంటెంట్‌తో వీడియోస్‌ పోస్ట్‌ చేస్తూ ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటున్నారు. అంతేకాదు తమ కో-స్టార్స్‌కి ప్రాంక్‌ చేసి ఆటపట్టించి ఏడిపిస్తుంటారు.

చదవండి: ప్రత్యేక ఆకర్షణగా నాగశౌర్య పెళ్లి భోజనాలు, అరేంజ్‌మెంట్స్‌ చూస్తే షాకవ్వాల్సిందే

తాజాగా టీవీ నటి మేఘన లోకేశ్‌ కూడా తాజాగా ఓ వీడియో షేర్‌ చేసింది. రీసెంట్‌గా యూట్యూబ్‌ చానల్‌ను ఓపెన్‌ చేసిన ఆమె తాజాగా తన కో-స్టార్స్‌, ఫ్రెండ్‌ని ప్రాంక్‌కాల్‌తో చెమటలు పెట్టించింది. నాకు ఎవ్వరూ లేరు అంటూ మేఘన ఈ వీడియో షేర్‌ చేసింది. ఇక సీరియల్ షూటింగ్స్‌తో ఫుల్‌ బిజీగా ఉండే మేఘనా ఖాళీగా ఇంట్లోనే కూర్చోవాల్సి వచ్చింది. బోర్‌ కొట్టడంతో ఫ్రెండ్స్‌కి ప్రాంక్ కాల్ చేద్దామని ఫిక్స్ అయిపోయింది.

చదవండి: పెళ్లి చేసుకోబోతున్న బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ నేహా చౌదరి.. వరుడు అతనే

ఈ క్రమంలో తన ఫ్రెండ్స్‌, నటి స్వర్ణకి కాల్‌ చేసి ‘ఇంట్లో ఎవరూ లేరు. నీరసంగా అనిపిస్తోంది. చచ్చిపోతానేమో’ అని అమాయకంగా మాట్లాడింది. దీంతో నటి స్వర్ణ తెగ కంగారు పడిపోయింది. ఇప్పుడే వచ్చేస్తా.. కాల్ కట్ చేయొద్దని భయపడిపోయింది. చివర్లో.. ఇది ప్రాంక్ అని మేఘన చెప్పడంతో ఆమె రిలాక్స్ అయ్యింది. అయినప్పటికీ మేఘన చేసిన పనికి ఆమెకు భయంతో చెమటలు పట్టాయి. అంతేకాదు ఒక్కసారిగా ఆమె కన్నీరు పెట్టుకుంది. చివరికి నేను బాగానే ఉన్నాను అంటూ వీడియో కాల్ చేసి మాట్లాడింది మేఘన. 

మరిన్ని వార్తలు