TV Actress Mythili Suicide Attempt: పంజాగుట్టలో టీవీ నటి ఆత్మహత్యాయత్నం, నిమ్స్‌కు తరలింపు

30 May, 2022 21:35 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ టీవీ నటి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన పంజాగుట్ట పోలీసు స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. సదరు నటిని మైథిలిగా పోలీసులు గుర్తించారు. సోమవారం సాయంత్రం ఆమె పంజాగుట్ట పోలీసులకు ఫోన్‌ చేసి తన భర్తపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది. అంతేకాదు తన భర్త బండి సీజ్‌ చేయాలని లేదంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని మైథిలి పోలీసులకు చెప్పినట్లు సమాచారం.
చదవండి: తెలుగు చిత్ర పరిశ్రమలో క్రమశిక్షణ లేదు: సుమన్‌ సంచలన వ్యాఖ్యలు

అప్పటికే మైథిలి 8 బ్రీజర్లు, స్లీపింగ్‌ ట్యాబ్లెటను మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇక ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారం పోలీసులు నటి ఇంటికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న మైథిలిని సమీపంలోని నిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స జరుగుతున్నట్లు సమాచారం. కాగా గతంలో కూడా మైథిలి మోతె పీఎస్‌లో తన భర్తపై కేసు పెట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు