మెర్సిడెజ్ బెంజ్ కొన్న బుల్లితెర నటి.. ధరెంతంటే?

29 Jan, 2023 16:06 IST|Sakshi

ప్రముఖ బుల్లితెర నటి ఖరీదైన కారును కొనుగోలు చేసింది. బాలీవుడ్‌ భామ, అనుపమ నటి రూపాలీ గంగూలీ దాదాపు రూ.90 లక్షల విలువైన మెర్సిడెస్ బెంజ్ కారును కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. తన కల నిజమైందని రూపాలీ తెలిపింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు అంటూ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. 

అత్యధిక పారితోషికం

రూపాలీ తన భర్త అశ్విన్ వర్మ, కుమారుడు రుద్రాంశ్ వర్మతో కలిసి షోరూమ్‌లో ఉన్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. కాగా.. రూపాలీ అత్యధిక పారితోషికం తీసుకునే టీవీ నటిగా పేరు సంపాదించింది. 'సారాభాయ్ వర్సెస్ సారాభాయ్','మోనిషా సారాభాయ్' 'అనుపమ'లో సీరియల్స్‌లో రూపాలి నటించారు. రూపాలీ ప్రారంభంలో రోజుకు రూ.1.5 లక్షలు తీసుకోగా.. ప్రస్తుతం రోజుకు రూ. 3 లక్షలు తీసుకుంటోంది.'సంజీవని'లో డాక్టర్ సిమ్రాన్ చోప్రా పాత్రను కూడా పోషించారు.

ఆ తరువాత 2006లో రియాల్టీ షో బిగ్ బాస్‌లో పోటీదారుగా పాల్గొన్నారు. అనుపమ సీరియల్‌లో రూపాలి పరిపూర్ణ గృహిణి, తల్లిగా నటిస్తోంది.'అనుపమ'లో సుధాన్షు పాండే, గౌరవ్ ఖన్నా, అనేరి వజని, మదాల్సా శర్మ, అల్పనా బుచ్, అరవింద్ వైద్య నటించారు. 

A post shared by Rups (@rupaliganguly)

మరిన్ని వార్తలు