Tv Actress Sreevani: లగ్జరీ కారు కొన్న నటి శ్రీవాణి.. ధర ఎంతంటే..!

25 Jan, 2023 11:23 IST|Sakshi

బుల్లితెరపై లేడీ విలన్‌గా విలనీజం చూపించిన నటి శ్రీవాణి. ప్రస్తుతం సీరియల్స్‌, షోలు మానేసి ఇంటికే పరిమితమైన ఆమె సోషల్‌ మీడియాలో అలరిస్తోన్న సంగతి తెలిసిందే. సొంతంగా యూట్యూబ్‌ చానల్‌ పెట్టి దాని ద్వారా తరచూ తన వ్యక్తిగత విషయాలను,  ఇంట్లో జరిగే శుభకార్యలకు సంబంధించిన వ్లాగ్స్‌ చేసి వీడియోలు షేర్‌ చేస్తుంది. తన భర్త విక్రమ్‌ ఆదిత్య, కూతురు నందినిలతో కలిసి ఈ యూట్యూబ్‌ చానల్‌ను రన్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇటివలె కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన ఆమె తాజాగా లగ్జరీ కారు కొనుగోలు చేసింది.

మారుతి గ్రాండ్‌ విటారా  కొన్న ఆమె కారు ఫొటోలు, వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. అంతేకాదు షో రూంలో కారు కొన్న అనంతరం నుంచి కారుకు పూజ చేయించి.. తన సహానటీనటులకు, సన్నిహితులకు పార్టీ ఇచ్చిన ఫుల్‌ వీడియోను తన యూట్యూబ్‌ చానల్లో అప్‌లోడ్‌ చేసింది. ఇక ఈ కారు ధర విషయానికి వస్తే రూ. 13 లక్షలపై ఉంటుందని తెలుస్తోంది. కాగా యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన శ్రీవాణి, ఆ తర్వాత పలు టీవీ సీరియల్స్‌లో నటించింది.  ‘కలవారి కోడలు’, ‘మనసు మమత’, ‘కాంచన గంగ’, ‘చంద్రముఖి’ లాంటి సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు పొందింది. 

చదవండి: 
ఎన్టీఆర్‌ వర్థంతి నాడు నాగ్‌ అలా.. ఏఎన్‌ఆర్‌ వర్ధంతి నాడు బాలయ్య ఇలా..
విజయ్‌ ఆంటోని కోమాలోకి వెళ్లాడా? ఆస్పత్రి బెడ్‌పై హీరో.. ఫొటో రిలీజ్‌!

A post shared by Strikers (@strikersinsta)

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు