Vaishali Takkar Death: ప్రముఖ టీవీ నటి ఆత్మహత్య.. సూసైడ్‌ నోట్‌ లభ్యం!

16 Oct, 2022 16:20 IST|Sakshi

చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ టీవీ నటి, సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ స్నేహితురాలు వైశాలి ఠక్కర్‌(30) ఆత్మహత్యకు పాల్పడింది. పలు సీరియళ్లలో నటించి బాలీవుడ్‌లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న వైశాలి.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉన్న తన నివాసంలో ఆదివారం ఉరివేసుకొని చనిపోయింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు.. వైశాలి నివాసం నుంచి సూసైడ్‌ నోట్‌ని స్వాధీనం చేసుకున్నారు.

ప్రేమ వ్యవహారం కారణంగానే వైశాలి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌కు వైశాలి మంచి స్నేహితురాలు. అతని మరణంపై అప్పట్లో ఆమె చాలా అనుమానాలు వ్యక్తం చేసింది. సుశాంత్‌ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, అతని మరణం వెనుక చాలా మంది ప్రమేయం  ఉందని ఆరోపించింది. ఆమె 2016లో రాజన్ షాహి నిర్మించిన లాంగ్-రన్ షో ‘యే రిష్తా క్యా కెహ్లతా హై’తో  టీవీలో అరంగేట్రం చేసింది వైశాలి.  అందులో సంజనా సింగ్ పాత్రను పోషించింది. ‘ససురల్ సిమర్ కా’, ‘సూపర్ సిస్టర్స్‌’,‘మన్మోహిని 2’ లాంటి సీరియల్స్‌లో నటించి మెప్పించారు.  చివరిసారిగా బిగ్ బాస్ 14 ఫేమ్ నిశాంత్ మల్కాని ‘రక్షాబంధన్ ’షోలో కనిపించింది. 
 

మరిన్ని వార్తలు