ప్రముఖ బుల్లితెర నటి కన్నుమూత

19 Oct, 2020 11:11 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ టీవీ నటి జరీనా రోషన్ ఖాన్(54)ఆదివారం కన్నుమూశారు. జరీనా గుండెపోటుతో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆమె అకాల మరణానికి పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు, టీవీ నటీనటులు తీవ్ర దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. జరీనా నటించిన ‘కుంకుమ్ భాగ్య’ సహనటీనటులు ఆమెకు సోషల్‌ మీడియా వేదికగా నివాళలు అర్పించారు. కుంకుమ్‌ భాగ్యలో జరీనా నటించిన ఇందూ దాది పాత్ర  ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. టీవీ నటుడు షబీర్ అహ్లువాలియా, నటి శ్రీతి జాలు జరీనాతో కలిసి దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి నివాళులు తెలిపారు. ‘మీది ఎల్లప్పుడు చంద్రుడి వలే ప్రకాశవంతమైన ముఖం’ అని షబీర్‌ కాప్షన్‌ జతచేశారు. నటి శ్రద్ధ ఆర్య జరీనా మృతితో తాను షాక్‌కకు గురయ్యానని, ఆమె మరణం చాలా బాధకరమని తెలిపారు. ‘జరీనా మరణాన్ని నమ్మలేకపోతున్నా. ఆమె బాలీవుడ్‌లోకి అడుగు పెట్టకముందు ‘కుంకుమ్ భాగ్య’ లో నటించారు’ అని నటి మృణాల్‌ ఠాకూర్ అన్నారు. జరీనా కుంకుమ్‌ భాగ్యతో పాటు ‘యే రిష్టా క్యా కెహ్లతా’లో కూడా నటించిన విషయం తెలిసిందే.

Ye chand sa Roshan Chehera 💔

A post shared by Shabir Ahluwalia (@shabirahluwalia) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా