ఫిలింసిటీలో అగ్నిప్రమాదం.. పూర్తిగా కాలిపోయిన సీరియల్‌ సెట్‌

10 Mar, 2023 18:34 IST|Sakshi

ప్రముఖ హిందీ సీరియల్‌ సెట్స్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం ముంబైలోని ఫిలిం సిటీలో 'ఘమ్‌ హై కిసికీ ప్యార్‌ మే' సీరియల్‌ సెట్‌లో భారీగా మంటలంటుకున్నాయి. దాదాపు సెట్‌ అంతా ధగ్దమైనట్లు కనిపిస్తోంది. ఈ సెట్‌ పరిసరాల్లోనే సీరియల్‌ యూనిట్‌ షూటింగ్‌ చేసినట్లు తెలుస్తోంది.

ఈ సెట్‌ సమీపంలో శూన్య స్క్వేర్‌ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న మరో సెట్‌కు సైతం ఈ మంటలు వ్యాపించాయి. కాగా సీరియల్‌ యూనిట్‌ అంతా ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇకపోతే ఓ బ్లాస్ట్‌కు సంబంధించిన సన్నివేశాన్ని చిత్రీకరించే సమయంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు కనిపిస్తోంది. నటీనటులు, సిబ్బంది వెంటనే అప్రమత్తమై సెట్‌ బయటకు పరుగులు తీయగా వారికి సంబంధించిన వస్తువులు మాత్రమే సెట్‌లోనే ఉండిపోయినట్లు తెలుస్తోంది.

A post shared by Viral Bhayani (@viralbhayani)

మరిన్ని వార్తలు