Kali Poster Controversy: ‘కాళీ’ పోస్టర్‌ వివాదం.. డైరెక్టర్‌ పోస్ట్‌ డిలిట్‌ చేసిన ట్విటర్‌

7 Jul, 2022 16:56 IST|Sakshi

దర్శకురాలు లీనా మణిమేగలై ఇటీవల విడుదల చేసిన కాళీ పోస్టర్‌పై దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. కాళీ అనే పేరుతో ఆమె తీస్తున్న డ్యాక్యుమెంటరీకి సంబంధించిన ఈ పోస్టర్‌ జూలై 2న కెనడాలోని టోరంటోలో ఉన్న అగాయాన్‌ మ్యూజీయంలో రిలీజ్‌ చేసింది. అప్పటి నుంచి ఈ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో దేశ వ్యాప్తంగా దూమారం రేపుతోంది. దేవత మూర్తి కాళిక అమ్మావారి వస్త్రధారణలో ఉన్న ఈపోస్టర్‌లో సిగరేట్‌ తాగుతున్నట్లుగా ఉండటంతో పలు సంఘాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి.

చదవండి: ఓటీటీకి సమ్మతమే మూవీ, స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే..

అంతేకాదు  ఈ పోస్టర్‌ అమ్మవారిని కించపరిచేలా ఉందని ఆరోపిస్తూ భారత్‌లో నిరసనలు వెల్లువెత్తున్నాయి. డైరెక్టర్‌ లీనా చేసిన పోస్ట్‌ మత విశ్వాసాలను, హిందువుల మనోభవాలను దెబ్బతీసేల ఉందంటూ పలు రాష్ట్రాల్లో ఆమెపై కేసులు కూడా నమోదయ్యాయి. అంతేకాదు కెనడాలోని భారత హైకమిషన్‌ కూడా దీనిపై వ్యతిరేకత తెలుపుతూ తీవ్రంగా పరిగణించింది. దీంతో స్పందించిన అగాఖాన్‌ మ్యూజియం కాళీ డాక్యూమెంటరీని తమ ప్రదర్శన నుంచి తొలగించింది. అంతేకాదు ట్విటర్‌ కూడా డైరెక్టర్‌ చేసిన పోస్ట్‌ను తొలిగించింది.

చదవండి: అందుకే ఇంతకాలం నటనకు దూరంగా ఉన్నా: వేణు తొట్టెంపూడి

ఇక దీనిపై డైరెక్టర్‌ లీనా స్పందిస్తూ అభ్యంతరక వ్యాఖ్యలతో మరో ట్వీట్‌ చేసింది. ఇప్పటికే తన పోస్టర్‌తో ఎంతోమంది ఆగ్రహనికి కారణమైన ఆమె తన తాజా ట్వీట్‌తో మరింత రెచ్చగొట్టేలా వ్యవహరించింది. మరి దీనిపై ఆమె ఎలాంటి పరిణామాలు ఎదర్కొంటుంది చూడాలి. తమిళనాడులోని మధురైకి చెందిన లీనా మణిమేగలై.. రిథమ్స్‌ ఆఫ్‌ కెనడాలో భాగంగా కాళీ పేరుతో డాక్యుమెంటరీని చిత్రీకరించింది. ఇప్పుడు ఈ డాక్యెమెంటరీకి చెందిన పోస్టరే వివాదస్పదమైంది.  

మరిన్ని వార్తలు