ట్రెండింగ్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌ మూవీ

22 Dec, 2020 12:00 IST|Sakshi

14 ఇయర్స్‌ ఆఫ్‌ ‘ రాఖీ’

యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం రాఖీ.. ఛార్మీ కౌర్‌, గోవా బ్యూటీ ఇలియానా ఫీమెల్‌ లీడ్‌లో నటించిన ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. సీనియర్‌ నటి సుహాసిని పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారిణి పాత్రలో కనిపించారు. ఇక జూనియర్‌ ఎన్టీఆర్‌కు కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాలలో రాఖీ ఒకటి. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ తన పాత్రలో అద్భుతంగా నటించారు. తను తప్ప మరెవరూ నటించలేరన్నంతగా డైలాగులతో ప్రతి ఒక్కరిని ఎమోషనల్‌గా టచ్‌ చేశారు. 2006లో ప్రేక్షకుల ముదుకు వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. నేటితో రాఖీకి(డిసెంబర్‌22) 14 ఏళ్లు పూర్తియ్యాయి. ఈ సందర్భంగా ట్విటర్‌లో #14YearsForRakhi అనే హ్యష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది. సినిమాలో ఎన్టీఆర్‌ నటన వేరే లేవల్‌లో ఉందంటూ అభిమానులు ట్వీట్‌ చేస్తున్నారు. చదవండి: బుల్లితెరపై మరోసారి హోస్ట్‌గా ఎన్టీఆర్‌

సిస్టర్‌ సెంటిమెంట్‌తో తెరకెక్కించిన ఈ సినిమాలో తన చెల్లెలికి జరిగినటువంటి అన్యాయాన్ని చూసి చలించిపోయిన హీరో తీవ్ర కుంగుబాటుకు గురవుతాడు. తన చెల్లె కేసుకు వ్యతిరేకంగా వాదించిన న్యాయవాదిని, దొగ సాక్ష్యం ఇచ్చిన డాక్టరును, పోలీసులను కూడా పెట్రోల్ పోసి తగులబెడతాడు. ఇలాంటి పరిస్థితి మరే అమ్మాయికి రాకూడదని కంకణం కట్టుకుంటాడు. అప్పటి నుంచి సమాజంలో ఏ ఆడపిల్లకు ఎక్కడ అన్యాయం జరిగినా అంతు చూసే పనిలో పడతాడు. అక్కడ నుంచి మాయమయిపోయిన రాఖీ ఎక్కడ ఏ ఆడపిల్లను ఎవరు వేదించినా, బాధించినా వాళ్ళని పెట్రోల్ పోసి తగులబెడుతుంటాడు. ప్రెగ్నెంట్ అయిన తన చెల్లెను డబ్బుపిచ్చితో కాల్చి చంపినా కోర్టులో కేసుకొట్టేయడం చూసిన రాఖీ తన చెల్లి అత్తింటి వారందరినీ కారుతో సహా పెట్రోల్ పోసి తగులబెడతాడు. సినిమా క్లైమాక్స్‌లో రాఖీ కోర్టులో మాట్లాడే సీన్ సినిమాకు హైలైట్‌గా నిలిచింది.

 


 

మరిన్ని వార్తలు