ట్విటర్‌ ట్రెండింగ్‌.. విక్రమ్‌ సినిమాకు 21 ఏళ్లు

10 Dec, 2020 12:16 IST|Sakshi

విభిన్నమైన కథాంశం కలిగిన చిత్రాలను ఎంచుకోవడంలో నటుడు చియాన్‌ విక్రమ్‌ ముందు వరుసలో ఉంటాడు. సూపర్‌స్టార్ కమల్ హాసన్ తర్వాత అంతటి విలక్షణ నటుడు ఎవరంటే తడుముకోకుండా చెప్పే పేరు విక్రమ్. తన నటనను చూస్తే ఎవ్వరైనా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. తమిళంతో పాటు తెలుగులో ఎంతో గుర్తింపుతెచ్చుకున్న విక్రమ్‌ను ముద్దుగా అభిమానులు చియాన్ అని పిలుస్తుంటారు. ప్రతీ సినిమాలోనూ ఓ డిఫెరెంట్ లుక్‌తో కనిపించేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఇక అపరిచితుడు సినిమాతో నటనలోని తన విశ్వరూపాన్ని చూపించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు విక్రమ్‌. అపరిచితుడు, జెమిని, సేతు, పితామగన్ లాంటి చిత్రాల్లో ఆయన నటన ప్రేక్షకులనే కాదు.. సినీ విమర్శకులను మెప్పించింది. చదవండి: హీరో విక్ర‌మ్ ఇంటికి బాంబు బెదిరింపులు

కాగా 1999లో వచ్చిన సేతు సినిమా విక్రమ్‌ కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌గా నిలిచింది. నటుడిగా విక్రమ్‌కు ఈ సినిమా బిగ్‌ బ్రేక్‌ను అందించింది. ఉత్తమ తమిళ చిత్రంగా జాతీయ అవార్డును అందుకోవడంతోపాటు మరిన్ని అవార్డులను సొంతం చేసుకుంది. తమిళంలో సేతు సూపర్‌ హిట్‌ విజయాన్ని సాధించడంతో తెలుగులో శేషుగా, కన్నడలో హుచ్చా, హిందీలో తేరే నామ్‌ పేరుతో రీమేక్‌ చేశారు. బాల దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఇళయారాజా సంగీతం అందించారు. ఈ సినిమా విడుదలై నేటికి 21 వసంతలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా విక్రమ్‌ అభిమానులు #21YearsOfEpicSETHU అనే హ్యష్‌ ట్యాగ్‌ను ట్విటర్‌లో ట్రెండ్‌ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు