సినిమా సెట్‌లో ప్రమాదం.. ఇద్దరు నటులు మృతి..

19 Jun, 2022 20:13 IST|Sakshi

సినిమా సెట్‌లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అప్పుడప్పుడు అనుకోని ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలాంటి ప్రమాదమే తాజగా మెక్సికోలోని బాజా కాలిఫోర్నియా సుర్‌ ద్వీపకల్పంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు నటులు చనిపోగా, ఆరుగురు గాయాల పాలయ్యారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ తెరకెక్కిస్తున్న ఒరిజినల్ సిరీస్‌ 'ది చూసెన్‌ వన్‌'. ఈ సిరీస్‌ చిత్రీకరణకు సంబంధించిన పనులు బాజా కాలిఫోర్నియా సమీపంలోని శాంటా రోసాలియా ప్రాంతంలో జరుగుతున్నాయి. 

అయితే ఎడారి ప్రాంతంలో రోడ్డుపై వెళ్తున్న వ్యాన్‌ పల్టీలు కొడుతూ షూటింగ్ స్పాట్‌లోకి దూసుకువెళ్లింది. దీంతో ఇద్దరు నటులు రేముండో గుర్డానో, జువాన్‌ ఫ్రాన్సిస్కో అగ్యిలర్‌ మరణించగా, అక్కడ పని చేస్తున్న ఆరుగురికి గాయాలైనట్లు బాజా కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కల్చర్‌ తెలిపింది. ఈ సంఘటన గురువారం (జూన్ 16) జరిగిందని వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ శనివారం (జూన్‌ 18) వెల్లడించింది. అయితే ఈ ప్రమాదంపై నెట్‌ఫ్లిక్స్ ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.

చదవండి:👇
వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్‌
చెత్త ఏరిన స్టార్‌ హీరోయిన్‌.. వీడియో వైరల్‌
థియేటర్‌లో అందరిముందే ఏడ్చేసిన సదా.. వీడియో వైరల్‌

కాగా 'ది చూసెన్‌ వన్‌' బ్రెజిలియన్‌ థ్రిల్లర్‌ సిరీస్‌. ఈ సిరీస్‌ మొదటి సీజన్‌ 2019లో విడుదలైంది. ఇప్పటివరకు రెండు సీజన్‌లు రిలీజ్‌ అవ్వగా, ప్రస్తుతం మూడో సీజన్ షూటింగ్‌ జరుగుతోంది. ఈ సిరీస్‌ అమెరికన్‌ జీసస్‌ కామిక్‌ బుక్‌ ఆధారంగా తెరకెక్కింది. ఈ సిరీస్‌ తాను తిరిగి వచ్చిన యేసు క్రీస్తు అని, మానవజాతిని రక్షించడానికి పుట్టినవాడుగా భావిస్తున్న 12 ఏళ్ల బాలుడి కథగా తెలుస్తోంది. 

చదవండి:👇 
సైలెంట్‌గా తమిళ హీరోను పెళ్లాడిన తెలుగు హీరోయిన్‌..
ఆ హీరోలా ఎఫైర్స్‌ లేవు.. కానీ ప్రేమలో దెబ్బతిన్నా: అడవి శేష్‌
డేటింగ్‌ సైట్‌లో తల్లి పేరు ఉంచిన కూతురు.. అసభ్యకరంగా మెసేజ్‌లు

మరిన్ని వార్తలు