Ugadi 2022: సినీ తారల శుభాకాంక్షలు.. నెట్టింట ఉగాది సందడి

2 Apr, 2022 12:20 IST|Sakshi

Cine Celebrities Wishes On Ugadi 2022: ఏప్రిల్‌ 2 శనివారం.. అంటే తెలుగువారికి కొత్త సంవత్సరం. ఈరోజు నుంచి 'శ్రీ శుభకృత్‌ నామ' తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు సాంప్రదాయకంగా భావించే ఈ ఉగాది పర్వదినాన్ని దక్షిణ భారతదేశంలో ఎక్కువగా జరుపుకుంటారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకలలో న్యూ తెలుగు ఇయర్‌ ప్రారంభంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా సినీ తారలు సోషల్ మీడియా వేదికగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఉగాది శుభాకాంక్షలతో సోషల్‌ మీడియాలో పండుగ హడావిడి కనిపిస్తూ సందడిగా మారింది. 'శ్రీ శుభకృత్ నామ' సంవత్సరంలో ప్రతి ఒక్కరికీ అన్ని శుభాలే జరగాలని మెగాస్టార్‌ చిరంజీవి కోరుకున్నారు. సోషల్‌ మీడియా వేదికగా శనివారం ఉదయం అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 

చిరంజీవితోపాటు కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌ బాబు, మహేశ్‌ బాబు, యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్, మహానటి కీర్తి సురేష్, డైరెక్టర్ శ్రీనువైట్ల, యంగ్‌ హీరో సుధీర్‌ బాబు, బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌ దేవగణ్‌ సహా పలువురు సినీ ప్రముఖులు నెట్టింట తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలిపారు. 
 

మరిన్ని వార్తలు