పల్లెటూరి ప్రేమకథతో అవికాగోర్‌ ‘ఉమాపతి’

16 Dec, 2023 17:52 IST|Sakshi

ఇటీవల ‘వధువు’ వెబ్‌ సిరీస్‌తో ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిన అవికా గోర్‌.. త్వరలోనే థియేటర్స్‌ ఆడియన్స్‌ని అలరించడానికి రెడీ అవుతోంది. అనురాగ్‌, అవికాగోర్‌ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘ఉమాపతి’.సత్య ద్వారంపూడి దర్శకత్వం  వహించిన ఈ చిత్రాన్ని క్రిషి క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని కే.కోటేశ్వర రావు నిర్మిస్తున్నారు.డిసెంబర్‌ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్‌ని రిలీజ్‌ చేశారు.

ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే అందమైన గ్రామీణ వాతావరణం, ఊర్లోని రకరకాల మనస్తత్వాలున్న మనషులు, అల్లరి చిల్లరగా తిరిగే హీరో.. రెండు ఊర్ల మధ్య ఏవో గొడవలు ఉన్నట్టు.. ఆ గొడవలే హీరో హీరోయిన్ల ప్రేమకు అడ్డంకిలా మారేట్టు చూపించిన సీన్లు బాగున్నాయి. ట్రైలర్‌లో సహజత్వం ఉట్టి పడుతోంది. విజువల్స్ ఎంతో నేచురల్‌గా ఉన్నాయి. ఆర్ఆర్ చక్కగా ఉంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ వినోదాత్మకంగా చిత్రంగా తెరకెక్కించినట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఫిదా వంటి బ్లాక్ బస్టర్ మూవీకి పని చేసిన మ్యూజిక్ డైరెక్టర్ శక్తికాంత్ కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. 

>
మరిన్ని వార్తలు