ఫస్ట్‌ ఫోటో.. కోహ్లి కూతురు తనేనా..

12 Jan, 2021 10:08 IST|Sakshi

టీమిండియా కెప్టెన్‌‌ విరాట్ కోహ్లి, నటి అనుష్క శర్మకు సోమవారం పండంటి పాప జన్మనిచ్చిన విషయం తెలదిసిందే. ఈ విషయాన్ని కోహ్లి స్వయంగా ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెలిపాడు. ‘ఈ రోజు మధ్యాహ్నం మాకు పాప పుట్టింది. ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. మీ అందరి ప్రేమానురాగాలకు ధన్యవాదాలు.  ప్రస్తుతం పాప, అనుష్క శర్మ ఇద్దరూ ఆరోగ్యం ఉన్నారు. దీంతో మా జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సమయంలో మా  ప్రైవసీని మీరంతా గౌరవిస్తారని ఆశిస్తూ.. ప్రేమతో మీ విరాట్’ అని ట్విటర్‌లో లేఖ ద్వారా వెల్లడించాడు. కాగా ఆస్ట్రేలియాతో తొలి టెస్టు అనంతరం విరాట్‌ కోహ్లి పెటర్నిటీ సెలవులపై స్వదేశానికి వచ్చాడు. తమకు తొలి బిడ్డ జన్మిస్తున్న క్షణాల్లో భార్య అనుష్క పక్కనే ఉండాలని నిర్ణయించుకున్నకోహ్లి ప్రస్తుతం ఆ మధుర క్షణాలను ఆస్వాదిస్తున్నాడు. చదవండి: అనుష్క-కోహ్లి‌ దంపతులకు కుమార్తె..!

ఇదిలా ఉండగా.. పాప పుట్టిన వార్తను తెలియజేసిన కోహ్లి తన ఫోటోను మాత్రం పంచుకోలేదు. ఈ నేపథ్యంలో విరుష్కల కూతురు ఎలా ఉంటుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో కోహ్లి సోదరుడు వికాస్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన ఫోటో వైరల్‌గా మారాయి. వికాస్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్‌ తండ్రి అయ్యాడన్న విషయాన్ని షేర్‌ చేస్తూ.. అప్పుడే పుట్టిన పాప కాలి ఫోటోను పోస్టు చేశారు. దీనికి ‘ఇంట్లోకి దేవత వచ్చింది. పట్టరానంత సంతోషంగా ఉంది.’ అనే క్యాప్షన్‌ ఇచ్చారు. అయితే ఫోటోలో చిన్న పాప ఉండటంతో తనే కోహ్లీ కూతురేనని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా చెప్పకపోయినా ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింటా చక్కర్లు కొడుతుంది. మరోవైపు అనుష్క, విరాట్‌ తల్లిదండ్రులు అయ్యారన్న విషయం తెలియగానే అభిమానులు ఆనందంలో మునిగితేలిపోతున్నారు. విరుష్క దంపతులకు సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

A post shared by Vikas Kohli (@vk0681)

A post shared by Bhawna Kohli Dhingra (@bhawna_kohli_dhingra)

మరిన్ని వార్తలు