చోటా రాజన్ మృతిపై రూమర్స్.. ఆర్జీవీ ట్వీట్‌ వైరల్‌

7 May, 2021 18:57 IST|Sakshi

అండర్‌ వరల్డ్‌ డాన్‌ చోటా రాజన్‌ కరోనాతో మరణించాడంటూ శుక్రవారం మధ్యాహ్నం మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, చోట రాజన్‌ బతికే ఉన్నాడని తీహార్‌ పోలీసులు స్పష్టత ఇచ్చారు. కరోనాతో బాధపడుతన్న చోటా రాజన్‌ని ఏయిమ్స్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని చెప్పారు.

ఇదిలా ఉంటే..చోటా రాజన్‌ మృతి చెందాడని వార్తలు రాగానే.. వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఓ ట్వీట్‌ చేశారు. ‘చోటా రాజన్‌ని కరోనా చంపేసింది. డీ కంపెనీలో రెండో స్థానంలో ఉన్నాడనే భయం లేకుండా రాజన్‌ని కరోనా చంపేసింది. ఆయన దాన్ని ఎందుకు హతం చేయలేదో నాకు అర్థం కావట్లేదు. దావూడ్‌ ఇప్పుడు ఎలా ఫీలవుతున్నాడో’అంటూ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశాడు.

ఇక చోటా రాజన్‌ మృతి చెందలేదని పోలీసులు స్పష్టం చేయగానే ఆర్జీవీ ఊపిరి పీల్చుకున్నాడు. చోటా రాజన్‌ మరణ వార్త ఒట్టి పుకారని, ఆయన కోవిడ్‌తో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని మరో ట్వీట్‌ చేశాడు. అలాగే అతనికి బెడ్‌, ఆక్సిజన్‌ అందాలని కోరుకుంటున్నానని తెలిపాడు. 

చదవండి:
ఆ వార్తలు అవాస్తవం.. చోటా రాజన్‌ బ్రతికే ఉన్నాడు! 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు