వంటలక్క భర్త ఎవరో తెలుసా? ఆయన ఎంత ఫేమస్‌ అంటే..

10 Jun, 2021 13:15 IST|Sakshi

తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోన్న సీరియల్‌ కార్తీక దీపం. స్టార్‌ మాలో ప్రసారం అయ్యే ఈ సీరియల్‌ ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాదాపు మూడున్నరేళ్లుగా ఎన్నో రికార్డులను క్రియేట్‌ చేస్తోన్న ఈ సీరియల్‌ టీఆర్పీ రేటింగ్‌లో నెంబర్‌1 స్థానంలో కొనసాగుతుంది. ఈ సీరియల్‌ వస్తుందంటే అన్ని పనులు పక్కనపెట్టి మరీ  సీరియల్‌ను చూసే అభిమానులు ఎంతోమంది ఉన్నారు. మలయాళంలో వచ్చిన ‘కరుతముత్తు' అనే సీరియల్‌ రీమేకే కార్తీకదీపం. ఈ ఒక్క సీరియల్‌తో కేరళలో బాగా పాపులర్‌ అయిన నటి ప్రేమీ విశ్వనాథ్‌. దీంతో రీమేక్‌లోనూ ఆమెనే తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వంటలక్కగా పాపులర్‌ అయిన ప్రేమీ విశ్వనాథ్‌ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

1991 డిసెంబర్‌2న కేరళలలో జన్మించిన ప్రేమీ విశ్వనాథ్‌ తండ్రి పేరు విశ్వనాథ్‌ కాగా, తల్లి కాంచన. లా చదివిన ప్రేమీ విశ్వనాథ్‌ ఓ ప్రైవేటు సంస్థకు లీగల్‌ అడ్వైజర్‌గా పనిచేసింది. ఇక సీరియల్స్‌లో నటించేకంటే ముందే మోడల్‌గానూ రాణించిందని సమాచారం. అంతేకాకుండా సొలోమన్‌ 3డీ అనే ఓ సినిమాలోనూ నటించింది. ఈమె అన్నయ్య శివప్రసాద్‌ ఫేమస్‌ ఫోటోగ్రాఫర్. ఆయనకు ఎర్నాకుళంలో రెండు స్టూడియోలు ఉన్నాయి. ప్రేమీ విశ్వనాథ్‌ కూడా సోదరుడి లాగే ఫోటోగ్రఫీ మీద మక్కువతో కొన్ని పెళ్లిళ్లు, శుభకార్యాలకు పనిచేసిందట.


ఇక ప్రేమీ విశ్వనాథ్‌ భర్త డా.వినీత్ భట్ ఆయన ఆస్ర్టాలజీ విభాగంలో పలు అంతర్జాతీయ అవార్డులు సైతం గెలుచుకున్నారు. ఈయన వద్దకు  పలువురు రాజకీయ, సినీ రంగానికి చెందిన వాళ్లు వస్తుంటారట. వినీత్‌ భట్‌ సూచనలతో తమ పేర్లలో కొన్ని మార్పులు కూడా చేసుకున్నట్లు సమాచారం. ఇక ప్రేమీ విశ్వనాథ్‌-వినీత్‌ భట్‌ దంపతులకు ఓ కొడుకు ఉన్నాడు. కార్తీకదీపంతో బాగా పాపులర్‌ అయిన వంటలక్కకు తెలుగులో పలు సినీ అవకాశాలు వస్తున్నాయట. కానీ ఇప్పటివరకు ఆమె ఒక్క ప్రాజెక్టుకు కూడా సైన్‌ చేయలేదని తెలుస్తోంది. 

చదవండి : నటుడు ప్రియదర్శి భార్య ఎవరో తెలుసా ?ఆమె ప్రొఫెషన్‌ ఏంటంటే..
'ఆట ఫేమ్‌ గీతిక ఎన్ని కష్టాలు పడుతుందో'.. ఆమె ఏం చెప్పిందంటే!

మరిన్ని వార్తలు