Fact About Anand Movie Child Artist: ఆనంద్‌ మూవీ చైల్డ్‌ ఆర్టిస్ట్‌ గురించిన ఈ ఆసక్తిర విషయాలు తెలుసా?

23 Jan, 2023 13:39 IST|Sakshi

డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల గురించి ప్రత్యేకం చెప్పన్కర్లేదు. సినిమాలను తెరకెక్కించడంలో ఆయన శైలి ప్రత్యేకమైనది. ఆయన సినిమాలంటే ఎలాంటి యాక్షన్‌, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉండవు. రియలస్టిక్‌కు దగ్గర ఉండే ఫీల్‌ గుడ్‌ లవ్‌స్టోరీస్‌ తీస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంటారు. పాత్రలతో ప్రయోగాలు చేస్తారు. సెన్సిబుల్‌ పాయింట్‌తో ధైర్యం చేస్తారు. అలా ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రాల్లో ఆనంద్‌ ఒకటి. మంచి కాఫీ లాంటి సినిమా అనేది ఉప శీర్షిక. ఈ మూవీ వచ్చి 18 ఏళ్లు గుడుస్తున్న ఇందులోని పాత్రలు, పాటలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి.

చదవండి: బాలయ్య ఫ్యాన్స్‌ చంపేస్తారేమోనని భయపడ్డా!: వరలక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు

వెండితెరపై రియల్‌ లైఫ్‌ పాత్రలను చూస్తున్నంత అనుభూతిని ఇచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. కుటుంబ నేపథ్యంలో ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల చేత నిజంగానే ఓ మంచి కాఫీ లాంటి సినిమా అనిపించుకుంది. ఇక ఇందులో ప్రతి పాత్రకు ఆయా నటులు జీవం పోశారని చెప్పవచ్చు. అందులో ఎప్పటికీ గుర్తుండిపోయే నటుల్లో ఆనంద్‌ ఆనంద్‌ అంటూ ముద్దు ముద్దుగా పిలుస్తూ హీరో రాజా చూట్టు తిరిగే చిన్నారి రోల్‌ కూడా ఒకటి. హీరో లిటిల్‌ ఫ్రెండ్‌గా సమత రోల్‌ పోషించింది ఆ చిన్నారి.

చెప్పాలంటే ఇందులో ప్రధాన పాత్రల్లో ఆ చిన్నారి రోల్‌ కూడా ఉంటుందనడంలో సందేహం లేదు. అయితే ఆనంద్‌ తర్వాత ఆ చిన్నారి తెరపై ఎక్కడా కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమెకు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. దీంతో ఈ చిన్నారి 18 ఏళ్ల తర్వాత తెరపైకి వచ్చింది.  ఆమె అసలు పేరు భకిత. ఇప్పుడు ఆమె వయసు 26 ఏళ్లు. ఒక్క సినిమాతోనే ఎంతో గుర్తింపు తెచ్చుకున్న భకిత మిగతా చైల్డ్‌ ఆర్టిస్టుల మాదిరిగా తిరిగి సినిమాల్లోకి రాలేదు. తన రూటే సపరేటు అంటూ భవిష్యత్తును కాస్తా భిన్నంగా ప్లాన్‌ చేసుకుంది. చదువుకుంటూనే సమాజ సేవలో పాల్గొంటుంది.

చదవండి: విజయ్‌ దూకుడు.. క్రీడారంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ‘రౌడీ’ హీరో

తన 17 ఏళ్ల వయసు నుంచి మహిళల హక్కుల కోసం, ఆడవాళ్ల హక్కులు గురించి పోరాడుతుంది. అంతేకాదు పిల్లలపై జరుగుతున్న దాడులు, అత్యచారాలు, అఘాత్యాయిలను ఖండిస్తూ వాటికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతూ ఉద్యమం చేస్తుందట. మహిళలపై, చిన్నారులపై అత్యాచారాలు జరగకుండా కఠినమైన చట్టాలు తీసుకురావాలని భకిత పోరాటం చేస్తోంది. 18 ఏళ్ల క్రితం చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకున్న భకిత ఇప్పుడు సమాజ క్షేమం కోసం ఆమె ఉద్యమాలు చేస్తూ ఎంతో మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. 

మరిన్ని వార్తలు