Unstoppable With NBK-Prabhas: ‘బాహుబలి’తో అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే.. ఆకట్టుకుంటున్న ప్రొమో గ్లింప్స్‌

14 Dec, 2022 12:38 IST|Sakshi

బాలయ్య హోస్ట్‌గా ఎన్‌బీకే విత్ అన్‌స్టాపబుల్ షో సీజన్‌-2 సక్సెస్‌ ఫుల్‌గా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ షోలో సందడి చేశారు. తాజాగా పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ అప్‌స్టాపబుల్‌ సందడి చేయబోతున్నాడు. ఇటీవల ఇందుకు సంబంధించిన షూటింగ్‌ కూడా పూర్తయింది. మ్యాచో స్టార్‌ గోపించంద్‌తో కలిసి ప్రభాస్‌ అన్‌స్టాపబుల్‌ షోకు హజరైన ఫొటోను ఆహా సంస్థ సోమవారం విడుదల చేసింది. షూటింగ్‌కు సంబంధించిన పలు వీడియోలు, ఫొటోలు కూడా లీక్‌ అయ్యాయి.

చదవండి: మహేశ్‌-రాజమౌళి మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్‌! సూపర్‌ స్టార్‌కు తండ్రిగా ఆ స్టార్‌ హీరో?

వీటికి ఫ్యాన్స్‌, నెటిజన్ల నుంచి విశేష స్పందన వచ్చింది. ఇక ఏ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం చూసిన ప్రభాస్‌ ఫొటోలు, వీడియోలే దర్శనం ఇస్తున్నాయి. సాధారణంగా ప్రభాస్‌ తన సినిమా ఈవెంట్స్‌ తప్పా ఏలాంటి కార్యక్రమాలైన హజరయ్యేందుకు పెద్దగా ఆసక్తి చూపడు. అలాంటి ప్రభాస్‌ బాలయ్య షోకు హజరవడంతో అభిమానులు, షో ఫాలోవర్స్‌లో ఆసక్తి నెలకొంది. అంతేకాదు ఈ ఎపిసోడ్‌పై మరింత హైప్‌ క్రియేట్‌ అయ్యింది. ఇక ఈ వీకెండ్‌ ఫుల్‌ ఎపిసోడ్‌ ప్రసారం కానున్న నేపథ్యంలో తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో గ్లింప్స్‌ను వదిలింది ఆహా. 

చదవండి: అవన్ని పుకార్లే.. ఒక్క పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చిన హీరోయిన్‌

ఇందులో ప్రభాస్‌ ఫుల్‌ జోష్‌లో కనిపించాడు. ఈ వీడియోలో ‘ఏమ్‌.. ఏం చెప్తున్నావ్‌ డార్లింగ్‌’ అంటూ ప్రభాస్‌ గట్టిగా అరుస్తు నవ్వులు పూయించాడు. ఆ తర్వాత బాలయ్య దగ్గరికి రమ్మంటే.. డార్లింగ్‌ వద్దు సర్‌ అన్నట్టుగా దూరం వెళ్లిపోవడం ఆకట్టుకుంది. మరోవైపు ఓకే సోఫాలో కూర్చొన్న గోపీచంద్‌కి ప్రభాస్‌ పెద్ద దెండం పెట్టి మీరు గొప్ప అన్నట్టుగా ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడం ఆసక్తిని రేపుతోంది. ప్రస్తుతంఈ ప్రోమో గ్లింప్స్ ఇంటర్నెట్‌లో దుమ్మురేపుతుంది. దీనికి నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంది. ఈ సందర్బంగా ప్రోమోను త్వరలోనే రిలీజ్‌ చేయబోతున్నట్లు ఆహా పేర్కొంది. 

మరిన్ని వార్తలు