Prabhas: అన్‌స్టాపబుల్‌ లేటెస్ట్‌ ప్రోమో.. ఆ ఇద్దరితో షాపింగ్‌కు సై అన్న ప్రభాస్‌

1 Jan, 2023 14:38 IST|Sakshi

ప్రభాస్‌, బాలయ్య కలిస్తే రచ్చ మామూలుగా ఉండదు.. అన్‌స్టపాబుల్‌ విత్‌ ఎన్‌బీకేలో ప్రభాస్‌ సందడికి సంబంధించిన ఒక ఎపిసోడ్‌ రిలీజ్‌ అవగా అది 100 మిలియన్‌ స్ట్రీమింగ్‌ మినిట్స్‌తో దూసుకుపోతోంది. అయితే మీరు చూసింది కూసంత చూడాల్సింది కొండంత అంటూ ఆహా తాజాగా రెండో ఎపిసోడ్‌ ప్రోమో రిలీజ్‌ చేసి న్యూఇయర్‌ ట్రీట్‌ ఇచ్చింది.

ఈ ప్రోమోలో గోపీచంద్‌, ప్రభాస్‌లను ప్రశ్నలతో ఆడుకున్నాడు బాలయ్య. ఇద్దరు హీరోయిన్ల ఫోటోలు చూపించి.. వీరిలో ఎవరితో మీ ఫోన్లు ఎక్స్‌చేంజ్‌ చేస్తారని అడిగారు. ఇందుకు గోపీచంద్‌ తనకు పెళ్లైపోయిందని చెప్పి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. 2008లో ఒక హీరోయిన్‌ విషయంలో గొడవపడ్డారని బాలయ్య కూపీ లాగేందుకు ప్రయత్నించగా నేనైతే పడలేదు, నీ గురించి చెప్పురా అని గోపీచంద్‌ను ఇరికించాడు ప్రభాస్‌.

నయనతార, తమన్నాల ఫోటోలు చూపించి.. వీరిలో ఎవరిని షాపింగ్‌కు తీసుకెళ్తారని అడగ్గా ఇద్దరినీ తీసుకెళ్తానన్నాడు డార్లింగ్‌. దీంతో బాలకృష్ణ రెబల్‌ స్టార్‌ నారీనారీ నడుమ మురారీ అంటూ స్టేజీపై నవ్వులు పూయించాడు. ఇక ఈ ఫన్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎపిసోడ్‌ జనవరి 6న విడుదల కానుంది.

చదవండి: ఆగని ధమాకా జోరు.. ఎన్ని కోట్ల కలెక్షన్స్‌ వచ్చాయంటే?
ఉన్నావా? చచ్చావా? నవ్వులు పూయిస్తున్న వీడియో

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు